శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
దశమహావిద్యల ఆలయాలు
దశమహావిద్యల ఆలయాలు:-
హిందూ సనాతన ధర్మంలో ఆదిపరాశక్తి యొక్క పది అత్యున్నత మరియు శక్తివంతమైన స్వరూపాలను దశమహావిద్యలు అంటారు. ఇవి విశ్వాన్ని శాసించే పది రకాల జ్ఞానాలకు మరియు శక్తులకు ప్రతీకలు. ఉగ్రరూపమైన కాళికా దేవి నుండి అత్యంత సౌమ్యమైన కమలాత్మిక వరకు ఇందులో అమ్మవారి వివిధ రూపాలు పూజించబడతాయి. దేవీ పురాణం ప్రకారం సతీదేవి తన భర్త పరమశివుని అనుమతి లేకుండానే తన తండ్రి దక్ష ప్రజాపతి తలపెట్టిన యజ్ఞానికి వెళ్లాలని నిశ్చయించుకుంటుంది. అప్పుడు శివుడు ఆమెను వారించి, ఆహ్వానం లేకుండా వెళ్ళిన యెడల అవమానం జరుగుతుందని చెబుతాడు. ఆ సమయంలో సతీదేవి తన శరీరం నుండి దివ్యమైన, మహోత్కుస్టమైన పది రూపాలలో అమ్మవార్లు ఉద్భవింపచేసి తన శక్తిని పరమశివునికి తెలియజేసింది. అవి కాళికా తారా, షోడశి, భువనేశ్వరి, త్రిపుర భైరవి, చిన్నమస్తా, ధూమావతి, బగలాముఖి, మాతంగీ, కమలాత్మిక దేవి అవతారాలు దశమహావిద్యలుగా ప్రసిద్ధి చెందాయి. భూమండలంలో పది దశమహావిద్యల అమ్మవార్లు వెలసిన ప్రదేశాలలో అక్కడి ఆలయాలు దేవతామూర్తులు ఏవిధంగా ఉంటాయో అదేవిధంగా ఈ ఓం శివశక్తి పీఠం శంబాల నగరంలో ఈ పది దశమహావిద్యల అమ్మవార్ల ఆలయాలు విడివిడిగా భూమండలంలో ఎక్కడా లేని విధంగా నిర్మించడమైనది. నిత్యం అభిషేకాలు, అర్చనలు, దూప దీప నైవేద్యాలు, యజ్ఞ యాగాలు, హోమ క్రతువులు ఓం శివశక్తి పీఠం శంబాల నగరం ఆధ్వర్యంలో నిర్వహించబడును. దర్శించండి పరిపూర్ణ అనుగ్రహం పొంది తరించండి.
దశమహావిద్యలు :-
భూమండలంలో పది దశమహావిద్యల అమ్మవార్లు వెలసిన ప్రదేశాలలో అక్కడి ఆలయాలు దేవతామూర్తులు ఏవిధంగా ఉంటాయో అదేవిధంగా ఈ ఓం శివ శక్తి పీఠంలో ఈ పది దశమహావిద్యల అమ్మవార్ల ఆలయాలు విడివిడిగా భూమండలంలో ఎక్కడా లేని విధంగా నిర్మించడమైనది. నిత్యం అభిషేకాలు, అర్చనలు, దూప దీప నైవేద్యాలు, యజ్ఞ యాగాలు, హోమ క్రతువులు ఓం శివశక్తి పీటం – శంబాల నగరం ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్నాయి. దర్శించండి పరిపూర్ణ అనుగ్రహం పొంది తరించండి.
1. కాళికా దేవి దేవాలయం
దశమహావిద్యలలో మొదటి శక్తిగా కాళికా దేవి (శ్రీ కాళీ మాత) పూజించబడుతుంది. కాళీ మాత సమస్త అజ్ఞానాన్ని పోగొట్టి దివ్యత్వాన్ని సూచిస్తుంది. దుష్ట శక్తులను సంహరించి, భక్తులను కంటికి రెప్పలా కాపాడే భవతారిణి.
2. తారా దేవి
తారా దేవి "దశమహావిద్యలలో" రెండవ రూపం. తార అనే సంస్కృత పదానికి "నక్షత్రం" మరియు "దాటించడం" అని అర్థం. సంసారం అనే భవసాగరాన్ని (జీవిత కష్టాలను) దాటించే తల్లిగా ఆమెను భక్తులు కొలుస్తారు. ఆమె జ్ఞానం, కరుణ మరియు రక్షణకు ప్రతీక.
3.శ్రీ షోడసీ దేవి
దశమహావిద్యలలో మూడవ మహావిద్య షోడశి దేవి అత్యంత శక్తివంతమైన దేవత. ఈమెను త్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, మరియు శ్రీ లలితా దేవి అని కూడా పిలుస్తారు. ఈ దేవతను ఆరాధించడం వల్ల భౌతిక సుఖాలు, జ్ఞానం, మరియు ఆధ్యాత్మిక ముక్తి లభిస్తాయని నమ్ముతారు.
4. శ్రీ భువనేశ్వరి దేవి
దశ మహావిద్యలలో శ్రీ భువనేశ్వరి దేవి నాల్గవది. ఈమెను ప్రసన్నం చేసుకోవడం వల్ల అడ్డంకులు తొలగిపోవడమే కాకుండా, ధైర్యం, జ్ఞానం, మానసిక ప్రశాంతత, మరియు ఐశ్వర్యం చేకూరుతాయని భక్తుల నమ్మకం.
5. శ్రీ త్రిపుర భైరవ దేవి
దశ మహావిద్య దేవతలలో త్రిపుర భైరవి ఆరవది. ఆమె ఆధ్యాత్మిక తపస్సు యొక్క ప్రచండ, పరివర్తనాత్మక శక్తికి ప్రతిరూపంగా నిలుస్తుంది. సృష్టి, స్థితిగతులను మరియు వినాశనం అనే సహజ చక్రాన్ని సూచిస్తుంది.
6. శ్రీ చిన్నమస్తా దేవి
చిన్నమస్తా దేవి మహావిద్యలలో ఆరవది. ఆమె ఒక చేతిలో తన నరికిన తలను, మరొక చేతిలో కత్తిని పట్టుకుని ఉండే "తలలేని దేవత"గా ప్రసిద్ధి చెందింది.
7. శ్రీ ధూమావతి దేవి
శ్రీ ధూమావతి దేవి దశ మహావిద్యలలో ఐదవ దేవత. ఈమె విశ్వనాశనానికి (ప్రళయ కాలానికి) ప్రతీక అయిన పరమేశ్వరి యొక్క భయంకరమైన రౌద్ర రూపం. అమంగళకరమైన విషయాలు, కష్టాలు, పేదరికం, మరియు ఒంటరితనానికి ఈమె అధిదేవతగా పరిగణించబడుతుంది.
8. శ్రీ బగలాముఖి దేవి
దశమహావిద్యలలో ఎనిమిదవ దేవత శ్రీ బగలాముఖి దేవి. శత్రువుల బలమును, వాక్కును స్తంభింపజేయడంలో ఈ దేవి అత్యంత శక్తివంతమైనదిగా భక్తులు నమ్ముతారు. పసుపు రంగు వస్త్రాలు, ఆభరణాలు ధరించి, బంగారు వర్ణంలో దర్శనమిస్తుంది.
9. శ్రీ మాతంగి దేవి
దశమహావిద్యలలో తొమ్మిదవ విద్యగా శ్రీ మాతంగి దేవి పూజలందుకుంటుంది. ఈమెను లలితా దేవి యొక్క మంత్రిణిగా భావిస్తారు. ఈమెను 'రాజమాతంగి', 'శ్యామలా దేవి' అని కూడా పిలుస్తారు.
10. శ్రీ కమలాత్మిక దేవి
దశమహావిద్యలలో పదవ మరియు చివరి మహావిద్యగా శ్రీ కమలాత్మికా దేవి అత్యంత పూజ్యనీయమైన దేవత. సంపద, శ్రేయస్సుకు అధిదేవతగా కొలువబడుతున్నారు. లక్ష్మీదేవి యొక్క దివ్య స్వరూపంగా భావించే ఈ తల్లిని ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని భక్తుల నమ్మకం.