శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

కాళికా దేవి దేవాలయం

Kalika Devi

కాళికా దేవి దేవాలయం:-

దశమహావిద్యలలో మొదటి శక్తిగా కాళికా దేవి (శ్రీ కాళీ మాత) పూజించబడుతుంది. కాళీ మాత సమస్త అజ్ఞానాన్ని పోగొట్టి దివ్యత్వాన్ని సూచిస్తుంది. దుష్ట శక్తులను సంహరించి, భక్తులను కంటికి రెప్పలా కాపాడే భవతారిణి. సృష్టిలోని సమస్త శక్తికి ఆమె మూలం, తల్లిగా భక్తుల కోరికలను త్వరగా తీర్చే కల్పవల్లి.

కాళీఘాట్ కాళీ దేవాలయం కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, 51 పవిత్ర శక్తి పీఠాలలో ఇది ఒకటి. ఇది భారతదేశంలోని నాలుగు ప్రధాన ఆదిశక్తి పీఠాలలో ఒకటి మరియు కాళీ ఆరాధనకు కేంద్ర స్థానం. శ్రీకాళీ మహా విద్యని ఆరాధిస్తే సకల వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుంది. శత్రు నాశనం, దీర్ఘాయువు, సకలలోక పూజత్వం సాధకుడికి కలుగుతుంది. శనికి అంతరిక్ష దేవత శ్రీ కాళికాదేవి. జాతకుడికి శనిగ్రహదోష నివారణ జరుగుతుంది. పుష్య, అనురాధ, ఉత్తర భాద్రపద నక్షత్రం వారు ఈ అమ్మవారిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయని పురాణాలు ఘోషిస్తున్నాయి. స్వయంభూగా వెలసిన ఆలయాల నమూనాల ఆధారంగా ఈ క్షేత్రంలో కాళికా దేవి అమ్మవారిని ప్రతిష్టించడం కొరకు సంకల్పించడమైనది. స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి..

శ్లోకం :-

శవారూఢాం మహాభీమాం ఘోరదంష్ట్రాం వరప్రదామ్ |

హాస్యయుక్తాం త్రిణేత్రాంచ కపాల కర్త్రికా కరామ్ ||

ముక్తకేశీం లలజ్జిహ్వాం పిబంతీం రుధిరం ముహుః |

భావం :-

శవముపై ఆసీనురాలై ఉన్నది, భయంకరమైన కోరలు కలిగినది, భక్తులకు వరాలు ఇచ్చేది, చిరునవ్వుతో ప్రకాశించేది, ముక్కన్నులు కలది, చేతిలో కపాలము (తలపుర్రె) మరియు కత్తిని ధరించినది, విరబోసుకున్న జుట్టు కలిగినది, బయటకు చాపిన నాలుకతో ఎల్లప్పుడూ రక్తాన్ని త్రాగుచున్నది అయినటువంటి మహాకాళిని నేను ధ్యానిస్తున్నాను.