శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

నాగ దేవత

Pineapple

హిందూ పురాణాలలో, మంత్ర శాస్త్రంలో మాతృ రూపంలో కొలువబడే నాగ దేవత అమ్మవారి ఆవిర్భావం అత్యంత విశిష్టమైనది. సాధారణంగా సర్పాల పుట్టుక కశ్యప ప్రజాపతి మరియు కద్రువ వల్ల జరిగితే, సర్పాలన్నింటికీ అధిదేవతగా, దేవతా స్వరూపంగా పూజలందుకునే "నాగ దేవత అమ్మవారి" అవతరణ పరమశివుని మనస్సు నుండి లేదా కశ్యప మహర్షి తేజస్సు నుండి జరిగింది. ఈమెను పురాణాలు "మానసా దేవి" అని, దక్షిణ భారతదేశంలో "నాగమ్మ" లేదా "నాగ దేవత" అని పిలుస్తారు.

పురాణ గాథ ప్రకారం, ఒకసారి పరమశివుడు అగాధమైన ధ్యానంలో (సమాధి స్థితిలో) ఉన్నప్పుడు, ఆయన మనస్సు నుండి ఒక అద్భుతమైన తేజస్సు వెలువడింది. ఆ దివ్య తేజస్సు నుండి ఒక అత్యంత సౌందర్యవతి, శక్తివంతమైన దేవి జన్మించింది. శివుని "మనస్సు" నుండి ఆవిర్భవించింది కాబట్టి ఈమెకు "మానసా దేవి" (నాగ దేవత అమ్మవారు) అనే పేరు వచ్చింది. ఈమె ఆవిర్భవించగానే సర్పాలన్నింటికీ రాణిగా, వాటిని రక్షించే అధినాయకురాలిగా బాధ్యతలు చేపట్టింది. స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి.

శ్లోకం : -

నమోస్తు సర్పేభ్యో యే కే చ పృథివీమను | యే అంతరిక్షే యే దివి తేభ్యః సర్పేభ్యో నమః |

భావం : -

భూమిపైన, అంతరిక్షంలోనూ మరియు స్వర్గలోకంలోనూ నివసిస్తున్న సమస్త సర్ప దేవతలకు నా నమస్కారములు.

Pineapple

నాగ బంధాలు : -

నాగ దేవత ఆలయాలలో "నాగ బంధం" శిల్పాలకు, ఆరాధనకు అత్యంత విశిష్టమైన, ప్రాధాన్యత కలిగిన స్థానం ఉంది. మీరు ఏదైనా ప్రముఖ నాగ క్షేత్రాన్ని గానీ, పురాతన శివాలయాలను గానీ దర్శించినప్పుడు... రెండు లేదా అంతకంటే ఎక్కువ సర్పాలు జడలాగా అల్లుకుపోయి, ఒకదాని తోకను మరొకటి నోటితో పట్టుకున్నట్లు ఉండే రాతి శిల్పాలు కనిపిస్తాయి. దీనినే "నాగ బంధం" అంటారు.

ఆలయ ప్రాంగణంలోకి లేదా గర్భగుడిలోకి ఎలాంటి దుష్టశక్తులు, క్షుద్ర ప్రయోగాలు, నరదృష్టి మరియు నెగటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా నాగ బంధం ఒక అదృశ్య వలయంలా కాపాడుతుందని నమ్ముతారు. గర్భగుడిలోని మూలవిరాట్ విగ్రహానికి చేసే మంత్రోచ్ఛారణలు, అభిషేకాల్లోని దైవిక శక్తి బయటకు పోకుండా, ఆలయ ప్రాంగణంలోనే కేంద్రీకృతమై ఉండేలా ఈ నాగ బంధ శిల్పాలు 'లాక్' లాగా పనిచేస్తాయి.

జాతకంలో రాహు-కేతువుల ప్రభావం వల్ల ఏర్పడే కాలసర్ప దోష తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, భక్తులు నాగ ఆలయాలలోని నాగ బంధ శిల్పానికి లేదా పలకకు విశేష పూజలు చేస్తారు. రాహువును పాము తలగా, కేతువును పాము తోకగా భావిస్తారు. నాగ బంధంలో తల, తోకలు ముడిపడి ఉండటం వల్ల... ఈ శిల్పాన్ని దర్శించుకుని, దానికి అభిషేకం చేస్తే రాహు-కేతు గ్రహాల పీడ తొలగిపోతుందని భక్తుల నమ్మకం.

శ్లోకం : -

"ఓం నమః శివాయ నమః నాగేంద్రాయ, సర్వ నాగ బంధన విమోచనం కురు కురు స్వాహా"

భావం : -

నాగరాజును ధరించిన ఆ పరమశివునికి నమస్కరిస్తున్నాను. నా జీవితంలో ఉన్న సమస్త నాగ బంధాలను (చిక్కులను), దోషాలను తొలగించి నన్ను అనుగ్రహించు గాక .

పూజా ఫలితం : -

జాతకంలో కాలసర్ప దోషం, రాహు-కేతు దోషాలు, లేదా పూర్వజన్మలో పాములను చంపడం వల్ల వచ్చే 'నాగ దోషం' ఉన్నవారికి ఈ పూజ వల్ల దోష నివారణ జరుగుతుంది. హిందూ సాంప్రదాయంలో నాగదేవతను సంతాన ప్రదాతగా నమ్ముతారు. సంతానం లేని దంపతులు రావిచెట్టు కింద ఉన్న నాగ ప్రతిమలకు పూజ చేసి, పాలు పోయడం వల్ల శీఘ్రంగా సంతానం కలుగుతుంది. నాగపూజ చేయడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు (సోరియాసిస్, అలర్జీలు) తొలగిపోయి అకాల మృత్యు భయం తప్పుతుందని విశ్వాసం. .