శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

నాగేశ్వర జ్యోతిర్లింగం

Back

నాగేశ్వర జ్యోతిర్లింగం

Pineapple

నాగేశ్వర జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో పదవది. ఈ క్షేత్రం గుజరాత్‌లోని ద్వారకకు సమీపంలో 'దారుకావనం' అనే ప్రాంతంలో కొలువై ఉంది. పరమశివుడు ఇక్కడ సర్పాలకు అధిపతిగా, నాగభూషణుడిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు.

పురాణాల ప్రకారం, ఈ ప్రాంతంలో 'దారుకుడు'అనే రాక్షసుడు అతని భార్య 'దారుక' తో కలిసి సాధువులను, ప్రజలను బంధించి హింసించేవారు. ఈ క్రమంలో వర్తకుడు శివభక్తుడైన 'సుప్రియుడు'ని, అతని అనుచరులను బంధించి జైలులో పెట్టగా సుప్రియుడు జైలులోనే మట్టితో శివలింగాన్ని చేసి, నిరంతరం శివపంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ పూజించడం చూసి కోపించిన దారుకాసురుడు సుప్రియుడిని చంపడానికి ఖడ్గాన్ని ఎత్తగా భక్తుని రక్షించడం కోసం పరమశివుడు ఒక దివ్య జ్యోతి స్వరూపంలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. శివుడు తన పాశుపతాస్త్రంతో రాక్షసులను సంహరించి, లోకానికి శాంతిని చేకూర్చాడు. అనంతరం అక్కడే నాగేశ్వరుడిగా జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు. స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి..

శ్లోకం :-

యామ్యే సదంగే నగరే అతిరమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః |

సద్భక్తిముక్తిప్రదమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే ||

భావం :-

అత్యంత సుందరమైన దారుకావన నగరంలో వెలిసి, వివిధ రకాల సర్పాలనే ఆభరణాలుగా ధరించి, తనను నమ్ముకున్న భక్తులకు సన్మార్గాన్ని, ఇహలోక సుఖాలను, అంత్యకాలంలో మోక్షాన్ని ప్రసాదించే ఆ ఏకైక రక్షకుడైన 'శ్రీ నాగేశ్వర' (నాగనాథ) స్వామిని నేను శరణు వేడుకుంటున్నాను.

పూజా ఫలితం :-

జాతకంలో కాలసర్ప దోషం, నాగ దోషం, లేదా రాహు-కేతువుల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నవారు ఈ స్వామిని దర్శిస్తే ఆ దోషాలన్నీ తక్షణమే తొలగిపోతాయి.నిత్యం ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల విషసర్పాల భయం, శత్రు భయం తొలగిపోయి, జీవితంలో అన్ని భోగభాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.