శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

శ్రీ భువనేశ్వరి దేవి

Kalika Devi

శ్రీ భువనేశ్వరి దేవి:-

దశ మహావిద్యలలో శ్రీ భువనేశ్వరి దేవి నాల్గవది. ఈమెను ప్రసన్నం చేసుకోవడం వల్ల అడ్డంకులు తొలగిపోవడమే కాకుండా, ధైర్యం, జ్ఞానం, మానసిక ప్రశాంతత, మరియు ఐశ్వర్యం చేకూరుతాయని భక్తుల నమ్మకం. దేవీ భాగవత పురాణం వంటి గ్రంథాలలో ఆమె హిందూ త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శివులను కూడా పాలించే అంతిమ సృష్టికర్త్రి. ఒడిశా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్‌లో 'భువనేశ్వరి దేవి' కొలువై ఉన్న ప్రధాన ఆలయం ఉంది. శ్రీ భువనేశ్వరీదేవిని ఉపాసించే సాధకుడికి మూడో కన్ను తెరుచుకుంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది. అంతేకాదు, రాజ్యధికారాన్ని సమస్త సిద్దుల్ని సకల సుఖభోగాల్ని ఈదేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు. చంద్రునకు అధిదేవత భువనేశ్వరీదేవి అమ్మవారు. పిచ్చి, ఉన్మాదము, హిస్టీరియా, మానసిక వికారాలు, కామప్రకోపాలు, గర్భాశయ వ్యాధులతో బాధపడేవారు శ్రీ భువనేశ్వరీ స్తోత్రం, కవచం లేదా హృదయం పారాయణ చేయుటవల్ల చంద్రగ్రహ బాధా నివారణ జరుగుతుంది. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారు ఈ అమ్మవారిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయని పురాణాలు ఘోషిస్తున్నాయి. స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి.. అందరూ అమ్మవారిని దర్శించండి తరించండి.

శ్లోకం :-

ఉద్యద్ది నద్యుతి మిందుకిరీటాం తుంగకుచాం నయనత్రయయుక్తామ్ |

పాశాంకుశ వరదాభయహస్తాం భువనేశ్వరీం ప్రణమామి

భావం :-

ఉదయిస్తున్న సూర్యుని కాంతి వలె ఎర్రని దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతున్నదాన్ని, తన శిరస్సుపై చంద్రవంకను కిరీటంగా ధరించినదాన్ని, సమస్త సృష్టిని పోషించే మాతృత్వానికి ప్రతీకగా నిలిచినదాన్ని, సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే మూడు కన్నులు కలిగినదాన్ని, తన చేతులలో పాశము మరియు అంకుశము ధరించి, మిగిలిన రెండు చేతులతో భక్తులకు వరాలను, అభయాన్ని ఇస్తున్నదాన్ని, అటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకియైన 'శ్రీ భువనేశ్వరి దేవి' కి నేను ప్రణామం చేస్తున్నాను.