శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి చరిత్ర :-
“శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారు” విఘ్నాలను తొలగించి భక్తుల కోరికలను నెరవేర్చే దైవంగా మన పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. “వరసిద్ధి” అనే నామం భక్తులకు వరాలను ప్రసాదించే స్వామి అనే అర్థాన్ని సూచిస్తుంది. గణపతిదేవుడు సిద్ది, బుద్ధికి అధిపతిగా విజయాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించేవాడు.సర్వ విఘ్నాలను తొలగించేవాడు అని పురాణ ప్రతీతి.
ఆవిర్భావం :-
కైలాసంలో పార్వతీదేవి స్నానానికి వెళ్తూ, పసుపు, గంధం నలుగు పిండితో ఒక బాలుడి బొమ్మను తయారుచేసి, దానికి ప్రాణం పోసి ద్వారం దగ్గర ఎవరినీ లోపలికి రానివ్వవద్దని కాపలా ఉంచుతారు. కొద్దిసేపటికి అక్కడకు వచ్చిన పరమశివుడిని ఆ బాలుడు అడ్డుకోగా శివుడికి కోపం వచ్చి, ఆ బాలుడి తలను ఖండిస్తాడు.ఆ సంఘటనతో తన కుమారుడుని విగతజీవిగా పడి ఉండటం చూసిన పార్వతీదేవి తల్లడిల్లిపోతుంది.శివుని ఆదేశం మేరకు శివగణాలు ఉత్తరం దిశగా వెళ్లిఏనుగు తలను తీసుకువచ్చి బాలుడి మొండానికి అతికించి పునర్జీవుడుగా చేస్తారు.ఆనాటి నుండి ఆ బాలుడుగణేశుడిగాదేవతలందరిలో మొదట పూజించబడే దేవుడిగా ప్రధమ గణనాధుడుగా పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి.స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం - శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి.
శ్లోకం : -
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ |
నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా ||
భావం : -
వక్ర తొండము, విశాలమైన రూపము మరియు కోట్ల సూర్యుల ప్రకాశము కలిగిన ఓ వినాయక దేవా! నేను చేసే అన్ని పనులలోనూ ఎల్లప్పుడూ ఎటువంటి ఆటంకాలు, విఘ్నాలు రాకుండా విజయవంతంగా పూర్తయ్యేలా అనుగ్రహించు.
పూజా ఫలితం : -
వినాయకుడు జ్ఞానానికి, విజయానికి, వినయానికి ప్రతీక. సమస్యా నివారకుడిగా, అడ్డంకులను తొలగించే దేవుడిగా భక్తులు ఆరాధిస్తారు. కలియుగంలో భక్తుల కోరిన కోర్కెలను ఉత్తరక్షణంలో తీర్చేవారు వినాయకుడు అని పురాణ ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి.