శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
శ్రీ వారాహి దేవి
వరాహి దేవి :
శ్రీ వారాహి దేవి హిందూ శాక్త సాంప్రదాయంలో సప్తమాతృకలలో (ఏడుగురు అమ్మవార్లు) ఐదవ దేవి మరియు శ్రీరాజరాజేశ్వరి దేవి (లలితా త్రిపురసుందరి) సేనాధిపతి . వరాహ ముఖం, మానవ శరీరం మరియు ఎనిమిది చేతులతో ఉగ్రరూపంలో దర్శనమిచ్చే ఈ దేవి, భక్తులను ఆపదల నుండి రక్షించే అత్యంత శక్తివంతమైన రక్షణ దేవత.
దేవీ భాగవతం మరియు మార్కండేయ పురాణం ప్రకారం వారాహి దేవి ఆవిర్భావం వెనుక రెండు ప్రధాన ఘట్టాలు ఉన్నాయి. మహావిష్ణువు హిరణ్యాక్షుడిని వధించడానికి ధరించిన మూడవ అవతారమే 'వరాహ అవతారం'. ఆ వరాహమూర్తి యొక్క స్త్రీ శక్తి స్వరూపమే (కాంతి స్వరూపమే) వారాహి దేవి. దుర్గాదేవి (చండిక) రక్తబీజుడనే భయంకరమైన రాక్షసుడితో యుద్ధం చేస్తున్నప్పుడు, ఆమెకు సహాయం చేయడం కోసం ముక్కోటి దేవతల శక్తులు స్త్రీ రూపాలు దాల్చాయి. ఆ సమయంలో విష్ణుమూర్తి అంతరంగం నుండి వరాహ ముఖంతో, చేతిలో హలము (నాగలి), ముసలము (రోకలి) ధరించి వారాహి దేవి ఉద్భవించింది. రక్తబీజుని శరీరం నుండి కిందపడే ప్రతి రక్తపు బొట్టు నుండి మరో రాక్షసుడు పుట్టకుండా, ఆ రక్తాన్ని నేలపై పడకుండా తాగి, రాక్షస సంహారంలో ఈమె కీలక పాత్ర పోషించింది. 'భండాసురుడు' అనే రాక్షసుడితో లలితా త్రిపురసుందరి దేవి యుద్ధం చేసినప్పుడు, వారాహి దేవి ఆమె సైన్యానికి "దండనాథా" (సర్వసేనాధిపతి) గా వ్యవహరించింది. సింహ్వాహనమైన లలితాదేవికి ఈమె 'కిరి చక్రం' పై కూర్చుని సైన్యాన్ని నడిపించింది.వారాహి దేవిని ఆరాధించడం వల్ల శత్రుబాధలు పటాపంచలవుతాయి. కోర్టు కేసులు, భూమి వివాదాలు అనుకూలంగా మారుతాయి. చేతబడి, నరఘోష, ఈర్ష్య, మరియు దిష్టి దోషాల వంటి నకారాత్మక శక్తులను వారాహి దేవి తన ఉగ్రత్వంతో తరిమికొడుతుంది. ఈమె వరాహమూర్తి శక్తి కావడం చేత భూలాభాన్ని మరియు అపారమైన సంపదను ప్రసాదిస్తుంది. స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం శంబాల నగరం" నందు వారాహి దేవి అమ్మవారిని శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ అమ్మవారిని దర్శించండి తరించండి.
శ్లోకం :-
"అస్య వారాహి దేవి తస్య నమః ప్రాతః కాలే విశేషతః |
మహిషాంతకరీం దేవీం చామరా కరధారిణీమ్ ||
హలముసలధరాం వందే వారాహీం సింహవాహినీమ్ |
శత్రునాశకరీం ఉగ్రాం భక్తానామభయప్రదామ్ ||"
భావం :-
మహిషాసురుడిని అంతమొందించినదానివి, చేతిలో నాగలి, రోకలి ఆయుధాలను ధరించినదానివి, సింహాన్ని (లేదా పెద్ద పందిని) వాహనంగా చేసుకున్నదానివి, శత్రువులను నాశనం చేసే ఉగ్రరూపిణివి మరియు భక్తులకు అభయాన్నిచ్చే ఓ శ్రీ వారాహి దేవి! నీకు నా నమస్కారములు.
పూజా ఫలితం :-
వారాహి దేవిని ఆరాధించడం వల్ల శత్రువుల కుతంత్రాలు పటాపంచలవుతాయి. కోర్టు కేసులు, భూమి వివాదాలు (లాండ్ డిస్ప్యూట్స్) అనుకూలంగా మారుతాయి. చేతబడి, నరఘోష, ఈర్ష్య, మరియు దిష్టి దోషాల వంటి నకారాత్మక శక్తులను వారాహి దేవి తన ఉగ్రత్వంతో తరిమికొడుతుంది. ఈమె వరాహమూర్తి శక్తి కావడం చేత భూలాభాన్ని (సొంత ఇల్లు, స్థలం కొనుగోలు చేయడం) మరియు అపారమైన సంపదను ప్రసాదిస్తుంది.