శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం
త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం
త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో బ్రహ్మగిరి పర్వతాల పాదాల వద్ద, గోదావరి నది (గౌతమీ తటం) పుట్టిన చోట కొలువై ఉన్న విశిష్టమైన క్షేత్రం . ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఎనిమిదవది.
పురాణాల ప్రకారం, పూర్వం ఈ ప్రాంతంలో తీవ్రమైన కరువు ఏర్పడినప్పుడు గౌతమ మహర్షి తన తపశ్శక్తితో వరుణని ప్రార్దించి, ఒక బావి ద్వారా నిరంతరం నీరు, ధాన్యం లభించేలా చేసి మునులను, ప్రజలను కాపాడాడు. అయితే, కొంతమంది మునులు గౌతమ మహర్షిపై అసూయతో ఒక మాయా ఆవును సృష్టించి గౌతమ మహర్షి పొలాల్లోకి పంపించగా ఆ ఆవు పొలంలో పండిన పంటను నాశనం చేస్తుండగా గౌతమ మహర్షి చూసి కేవలం ఒకదర్భ (గడ్డిపరక) చేతిలోకి తీసుకుని, ఆవును తట్టగా ఆ మాయా ఆవు అక్కడికక్కడే ప్రాణాలు విడవగా గౌతమ మహర్షికి'గోహత్యా పాతకం' వచ్చింది.ఈ పాప ప్రక్షాళన కోసం ఘోర తపస్సు చేసి పరమశివునిని ప్రార్దించగా తన పాపాన్ని కడిగివేయడానికి, లోకకల్యాణం కోసం ఆకాశ గంగను భూమికి పంపమని వేడుకోగా శివుని జటాజూటం నుండి గంగ నదిగా ఉద్భవింపజేసి బ్రహ్మ, విష్ణువులతో కలిసి త్రయంబకేశ్వరుడిగా జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు. స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి..
శ్లోకం :-
సహ్యాద్రిశీర్షే విమలే వసంతం గోదావరీతీరపవిత్రదేశే |
యద్దర్శనాత్ పాతకమాశు నాశం ప్రయాతి తం త్ర్యంబకమీశమీడే ||
భావం :-
పవిత్రమైన గోదావరి నదీ తీరంలో, సహ్యాద్రి పర్వత శిఖరాల చెంత నివసిస్తూ, కేవలం తన దర్శన మాత్రంచేతనే భక్తుల సమస్త పాపాలను తక్షణమే నాశనం చేసే ఆ త్రయంబకేశ్వర స్వామిని నేను ప్రార్థిస్తున్నాను.
పూజా ఫలితం :-
ఈ క్షేత్రం పితృ దోషాలు, కాలసర్ప దోషాలు, మరియు నవగ్రహ దోషాల నివారణకు అత్యంత ప్రసిద్ధి. ఇక్కడ జరిపించే 'నారాయణ నాగబలి', 'త్రిపిండీ శ్రాద్ధం' పూజల వల్ల వంశపారపర్య దోషాలు తొలగి,గోహత్యా పాతకంతో సహా అన్ని ఘోర పాపాలు నశించి, సుఖసంతోషాలు కలుగుతాయి.