శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

శ్రీ షోడసీ దేవి

Kalika Devi

శ్రీ షోడసీ దేవి:-

దశమహావిద్యలలో మూడవ మహావిద్య షోడశి దేవి అత్యంత శక్తివంతమైన దేవత. ఈమెను త్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, మరియు శ్రీ లలితా దేవి అని కూడా పిలుస్తారు. ఈ దేవతను ఆరాధించడం వల్ల భౌతిక సుఖాలు, జ్ఞానం, మరియు ఆధ్యాత్మిక ముక్తి లభిస్తాయని నమ్ముతారు. త్రిపుర సుందరి ఆలయం (ఉదయ్‌పూర్, త్రిపుర) 51 శక్తి పీఠాలలో ఒకటి , ఇక్కడ దేవిని నేరుగా త్రిపుర సుందరిగా పూజిస్తారు. శాంతి స్వరూపిణి అయిన రాజరాజేశ్వరి దేవిని ఉపాసిస్తే ఆ సాధకుడికి అన్నిరకాల కష్టనష్టాలనుంచి విముక్తి మానసికశాంతి, భోగం, మోక్షం కలుగుతాయి. బుధగ్రహానికి అధిదేవత 'షోడశీ' మహాదేవి. జ్యోతిష, వైద్య, వైజ్ఞానిక, గణిత, నాటక, సంగీత, న్యాయ, మీమాంస శాస్త్రాధ్యయనం చేసేవారు ఈ మహాదేవిని శాస్త్రోక్తంగా ఆరాధించుటవల్ల బుధగ్రహ బాధానివారణ జరిగి మేధాశక్తి పెంపొందుతుంది. బుధ ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారు ఈ అమ్మవారిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయని పురాణాలు ఘోషిస్తున్నాయి. స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి..

శ్లోకం :-

బాలార్కమండలాభాసాం చతుర్బాహుం త్రిలోచనామ్ |

పాశాంకుశశరాంశ్చాపం ధారయంతీం శివాం భజే ||

భావం :-

ఉదయించే సూర్యమండలం లాంటి ఎర్రని దివ్యమైన కాంతితో మెరిసిపోయేదాన్ని, నాలుగు చేతులు మరియు మూడు కన్నులు కలిగినదాన్ని, తన నాలుగు చేతులలో పాశము, అంకుశము, ఐదు పుష్ప బాణములు, మరియు చెరుకు విల్లును ధరించినదాన్ని, సకల మంగళాలను ప్రసాదించే ఆ 'శ్రీ షోడశీ' దేవిని నేను మనస్ఫూర్తిగా ధ్యానిస్తున్నాను.