శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
భీమశంకర జ్యోతిర్లింగం
భీమశంకర జ్యోతిర్లింగం
భీమశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని పూణే సమీపంలో సహ్యాద్రి పర్వత శ్రేణులలో భీమా నది పుట్టిన చోట కొలువై ఉన్న పవిత్ర క్షేత్రం.
త్రేతాయుగంలో కుంభకర్ణుడికి, కర్కటికు జన్మించిన 'భీమాసురుడు' అనే రాక్షసుడు తన తండ్రిని శ్రీరాముడు చంపాడని తెలుసుకుని,బ్రహ్మదేవుని కోసం కఠోర తపస్సు చేసి అపారమైన శక్తులు పొంది అహంకారంతో దేవతలను, మునులను వేధించడం ప్రారంభించాడు.
ఈ క్రమంలో శివభక్తుడైన 'కామరూపేశ్వరుడు' అనే రాజుశివలింగాన్ని పూజిస్తున్న సమయంలో భీమాసురుడు దానిని పగలగొట్టడానికి ఖడ్గాన్ని ఎత్తిన క్షణంలో పరమశివుడు ఆ లింగం నుండి ఉగ్రరూపంతో ప్రత్యక్షమయి రాక్షసుడిని సంహరించి లోకానికి శాంతిని చేకూర్చాడు. అనంతరం మునుల ప్రార్థన మేరకు అక్కడేభీమశంకరుడిగాజ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు. స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి..
శ్లోకం :-
యం డాకినీశాకినికాసమాజే నిషేవ్యమానం పిశితాశనైశ్చ |
సదైవ భీమాదిపదప్రసిద్ధం తం శంకరం భక్తహితం నమామి ||
భావం :-
డాకినీ, శాకినీ మరియు రాక్షస గణాలచే నిరంతరం సేవించబడే దట్టమైన అరణ్య ప్రాంతంలో, భీమా నదీ తీరాన వెలసి, భక్తుల మేలు కోరే ఆ 'భీమశంకర' స్వామికి నేను నమస్కరిస్తున్నాను.
పూజా ఫలితం :-
ఈ స్వామిని నిత్యం స్మరించడం వల్ల, దర్శనం వల్ల శత్రు భయాలు, నరఘోష, మరియు దుష్ట శక్తుల పీడలు, మనసులోని కుటిలత్వం నశించి, సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.