శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
శ్రీ త్రిపుర భైరవ దేవి
శ్రీ త్రిపుర భైరవ దేవి:-
దశ మహావిద్య దేవతలలో త్రిపుర భైరవి ఆరవది. ఆమె ఆధ్యాత్మిక తపస్సు యొక్క ప్రచండ, పరివర్తనాత్మక శక్తికి ప్రతిరూపంగా నిలుస్తుంది. సృష్టి, స్థితిగతులను మరియు వినాశనం అనే సహజ చక్రాన్ని సూచిస్తుంది. ఆమెను సాధారణంగా ఎర్రని వస్త్రాలు ధరించి, పద్మంపై లేదా శివునిపై కూర్చున్న అందమైన, తేజోవంతమైన దేవతగా చిత్రిస్తారు. భైరవి దేవి ప్రధాన దేవాలయం భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైనది వారణాసిలో ఉంది. ఈ దేవాలయం దశాశ్వమేధ ఘాట్ సమీపంలోని మీర్ ఘాట్‌లో కొలువై ఉంది. స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి..
శ్లోకం :-
సద్యస్సముద్యత సహస్ర దివాకరాభాం | విద్యాక్షసూత్రవరదాభయచిహ్నహస్తామ్ ||
నేత్రోత్పలైస్త్రిభిరలంకృతవక్త్రపద్మాం | త్వాల్లాం తారహారరుచిరాం త్రిపురాం భజామః
భావం :-
ఒకేసారి ఉదయించిన వేల సూర్యుల ప్రచండమైన ఎర్రని తేజస్సుతో వెలిగిపోతున్నదాన్ని, తన చేతులలో విద్యా గ్రంథాన్ని, అక్షరమాలను ధరించి, మిగిలిన రెండు చేతులతో భక్తులకు వరాలను, అభయాన్ని ఇస్తున్నదాన్ని, పద్మం వంటి అందమైన ముఖంపై తామర పువ్వుల లాంటి మూడు కన్నులతో ప్రకాశిస్తున్నదాన్ని, మెడలో ముత్యాల హారాలు మెరుస్తుండగా, మూడు లోకాలకు మూలమైన ఆ 'శ్రీ త్రిపుర భైరవి' దేవిని నేను భజిస్తున్నాను.