శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
శ్రీ శాంకరీ దేవి
శ్రీ శాంకరీ దేవి ఆలయం (శ్రీలంకలోని త్రింకోమలి) ఆదిశంకరాచార్యులు పేర్కొన్న అష్టాదశ (18) శక్తిపీఠాలలో మొట్టమొదటి శక్తిపీఠం. హిందూ మహాసముద్ర తీరాన ఒక ఎత్తైన కొండపై కొలువై ఉన్న ఈ క్షేత్రం అత్యంత మహిమాన్వితమైనది.
దక్షయజ్ఞం తర్వాత సతీదేవి పవిత్ర శరీరాన్ని విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఖండించినప్పుడు, అమ్మవారి "కాలి గజ్జెలు" (మరికొన్ని పురాణాల ప్రకారం తొడ భాగం) పడిన పవిత్ర స్థలమిది. ఇక్కడ అమ్మవారు 'శాంకరీ దేవి' గా, పరమశివుడు 'త్రికోణేశ్వరుడు' (కోణేశ్వరం) గా వెలిశారు. స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి..
శ్లోకం : -
"లంకాయాం శాంకరీ దేవీ, కామాక్షీ కాంచికాపురే |
ప్రద్యుమ్నే శృంఖలా దేవీ, చాముండీ క్రౌంచపట్టణే ||"
భావం : -
శ్రీలంక దేశంలో 'శాంకరీ దేవి' గా, కాంచీపురంలో 'కామాక్షీ దేవి' గా, ప్రద్యుమ్న నగరంలో 'శృంఖలా దేవి' గా, మరియు మైసూర్ (క్రౌంచపట్టణం) లో 'చాముండేశ్వరీ దేవి' గా వెలిసిన ఆ జగన్మాతకు నేను నమస్కరిస్తున్నాను.
పూజా ఫలితం : -
అష్టాదశ శక్తిపీఠాలలో ప్రథమ పీఠమైన శాంకరీ దేవిని దర్శించడం లేదా శ్లోకాన్ని స్మరించడం వల్ల జీవితంలోని సమస్త అడ్డంకులు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహం వల్ల దీర్ఘకాలిక అనారోగ్యాలు నయమవుతాయి, మానసిక ప్రశాంతత లభిస్తుంది.