శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
మల్లికార్జున జ్యోతిర్లింగం
మల్లికార్జున జ్యోతిర్లింగం
మల్లికార్జున జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో శ్రీశైల పర్వతంపై వెలసిల్లుతున్నది.దీనినే దక్షిణ కైలాసం అని కూడా అంటారు. కృష్ణానదిని ఇక్కడ పాతాళగంగ అంటారు. ఒకరోజు పరమశివుడు, పార్వతీదేవి తమ కుమారుల వివాహ విషయమై ఎవరికి ముందు వివాహం చేయవలననే చర్చకు వచ్చి కుమారులు ఇరువురికీ పోటీ పెట్టగా "ఎవరు భూమండలాన్ని ముందుగా ప్రదక్షిణ చేసి వస్తారో, వారికే మొదటి వివాహం జరుగుతుంది" అని ప్రకటించారు. ఈ పోటీలో బుద్ధి బలంతో అలోచించి తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణతో సమానం అని గ్రహించి శివపార్వతులకు మూడుసార్లు భక్తితో ప్రదక్షిణ చేసి పోటీలో విజయం సాదించి ప్రదమాదిపత్యాన్ని పొంది బుద్ధి, సిద్ధిలను వివాహం ఆడాడు. ఈ క్రమంలో అలక చెందిన కుమారస్వామితల్లిదండ్రులు ఎంత నచ్చజెప్పినా వినకుండా, తపస్సు చేసుకోవడం కోసం క్రౌంచ పర్వతానికి (ప్రస్తుత శ్రీశైలం ప్రాంతం) వెళ్ళిపోయాడు.పార్వతీ పరమేశ్వరులు తమ కుమారుడిని చూడటానికి క్రౌంచ పర్వతానికి వెళ్ళినపుడు కుమారస్వామిపై ప్రేమతో పరమశివుడు అక్కడ ఒక జ్యోతిర్లింగ రూపంలో స్థిరపడిపోయాడు. అప్పటినుండి ప్రతి అమావాస్య రోజున పరమశివుడు, ప్రతి పౌర్ణమి రోజున పార్వతీదేవి కుమారస్వామిని చూడటానికి ఇక్కడికి వస్తారని భక్తుల నమ్మకం. స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం - శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి.
శ్లోకం :-
కాశ్యాంతు మరణాన్ముక్తిః స్మరణా దారుణాచలేదర్శనాదేవ శ్రీశైలే పునర్జన్మ న విద్యతే ||
భావం :-
కాశీ క్షేత్రంలో మరణించడం వల్ల మాత్రమే ముక్తి లభిస్తుందని, అరుణాచలం క్షేత్రాన్ని కేవలం మనసులో స్మరించడం వల్ల ముక్తి లభిస్తుందని,శ్రీశైల క్షేత్రాన్ని కేవలం కనులారా దర్శించుకోవడం వల్ల...ఇక ఏమాత్రం పునర్జన్మ అనేది ఉండదు.
పూజా ఫలితం :-
శ్రీశైల మల్లికార్జునుడిని, భ్రమరాంబికా దేవిని పూజించడం వల్ల ఈ లోకంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలిగి, అంత్యకాలంలో శివసాయుజ్యం లభిస్తుంది.