శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

మాధవేశ్వరి

సోమనాథ జ్యోతిర్లింగం

శ్రీ మాధవేశ్వరి దేవి ఆలయం (ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ / ప్రయాగ్‌రాజ్) ఆదిశంకరాచార్యులు పేర్కొన్న అష్టాదశ (18) శక్తిపీఠాలలో పద్నాలుగవ శక్తిపీఠం. గంగ, యమున, మరియు గుప్త సరస్వతి నదులు కలిసే పవిత్ర "త్రివేణి సంగమం" సమీపంలో (అలోపిబాగ్ ప్రాంతంలో) ఈ క్షేత్రం కొలువై ఉంది.

దక్షయజ్ఞం తర్వాత సతీదేవి పవిత్ర శరీరాన్ని విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఖండించినప్పుడు, అమ్మవారి "కుడి చేతి వేళ్ళు" పడిన పరమ పవిత్రమైన స్థలమిది. ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత విలక్షణమైనది. ఇక్కడ అమ్మవారికి ఎటువంటి శిల్పం లేదా విగ్రహం ఉండదు. పురాణాల ప్రకారం, అమ్మవారి శరీర చివరి భాగమైన వేళ్ళు ఇక్కడ పడగానే అవి భూమిలో "అదృశ్యం" అయ్యాయి. అందువల్ల ఇక్కడ విగ్రహానికి బదులుగా ఒక చిన్న వేదిక పై ఉంచిన "చెక్క ఊయల" లేదా పల్లకీ ను భక్తులు అత్యంత భక్తితో పూజిస్తారు. బ్రహ్మదేవుడు సృష్టి కార్యాల నిర్విఘ్నత కోసం ఇక్కడ గొప్ప యాగాలు చేయడం వల్ల దీనిని 'ప్రయాగ' (ప్రకృష్టమైన యాగం జరిగిన చోటు) అని పిలుస్తారు. స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి.

శ్లోకం : -

"ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠికాపుర్యాం పురుహూతికా |ఓఢ్యాయాం గిరిజాదేవీ, మాణిక్యా దక్షవాటికే || హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ |"

భావం : -

పవిత్ర త్రివేణి సంగమ క్షేత్రమైన ప్రయాగలో 'శ్రీ మాధవేశ్వరి దేవి' (అలోపి మాత) గా వెలిసిన ఆ జగన్మాతకు నా ప్రణామములు.

పూజా ఫలితం : -

కాశీ యాత్ర చేసినవారు ప్రయాగలో త్రివేణి సంగమ స్నానం ఆచరించి, మాధవేశ్వరి దేవిని (అలోపి మాత) దర్శించుకుంటేనే వారి యాత్రా ఫలం సంపూర్ణమవుతుంది. అదృశ్య రూపంలో ఉండి భక్తులను కాపాడే తల్లి కాబట్టి, ఈమెను స్మరిస్తే జీవితంలో ఎదురయ్యే ఆకస్మిక విపత్తులు, ప్రమాదాల నుండి రక్షణ లభిస్తుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జరిగే ప్రసిద్ధ 'మహా కుంభమేళా' సమయంలో ఈ దేవిని దర్శించడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి.