శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

కేదార్నాథ్ జ్యోతిర్లింగం

Back

కేదార్నాథ్ జ్యోతిర్లింగం

Pineapple

కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వత శ్రేణులలో, మందాకినీ నదీ తీరాన కొలువై ఉన్న అత్యంత పవిత్రమైన క్షేత్రం.

కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత, కౌరవులను చంపిన పాపం పోగొట్టుకోవడం కోసం పాండవులు శివుని దర్శనం కోసం బయలుదేరారు. కానీ, శివుడు వారికి దర్శన మివ్వడానికి ఇష్టపడక, గుప్తకాశీలో ఒక ఎద్దు రూపంలో దాక్కున్నాడు.

పాండవులు ఆ ఎద్దును గుర్తించి పట్టుకోవడానికి ప్రయత్నించగా, అది భూమిలోకి కుంగిపోసాగింది. అప్పుడు భీముడు ఆ ఎద్దు యొక్క వెనుక భాగాన్ని గట్టిగా పట్టుకున్నాడు. పాండవుల భక్తికి మెచ్చిన పరమశివుడు అక్కడ త్రికోణాకారపు శిలా రూపంలో జ్యోతిర్లింగంగా వెలిశాడు. స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి..

శ్లోకం :-

మహాద్రిపార్శ్వే చ తటే రమంతం సంస్తూయమానం సతతం మునీంద్రైః |

దేవాసురైర్యక్షమహోరగాద్యైః కేదారమీశం శివమేకమీడే ||

భావం :-

మహా హిమాలయ పర్వతాల మధ్యన, అత్యంత సుందరమైన మందాకినీ నదీ తీరంలో కొలువై ఉండి, మునీశ్వరులు, దేవతలు, అసురులు, యక్షులు, నాగుల చేత నిరంతరం స్తుతించబడే ఆ ఏకైక రక్షకుడైన 'కేదారేశ్వరుడిని'నేను ప్రార్థిస్తున్నాను.

పూజా ఫలితం :-

కేదార్నాథ్ క్షేత్రాన్ని దర్శించడం వల్ల ఎంతటి ఘోరమైన పాపాలైనా క్షణంలో నశిస్తాయని శివపురాణం చెబుతోంది.ఈ క్షేత్ర మార్గంలో ప్రయాణిస్తూ మరణించినా నేరుగా శివలోక ప్రాప్తి (మోక్షం) కలుగుతుందని భక్తుల నమ్మకం.