శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
ద్వాదశ జ్యోతిర్లింగాల ఆవిర్భావం
ద్వాదశ జ్యోతిర్లింగాల ఆవిర్భావం :-
హిందూ పురాణాల (ముఖ్యంగా శివ పురాణం) ప్రకారం ఒకసారి బ్రహ్మ, విష్ణువు తమ ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయంపై వాగ్వివాదానికి దిగారు. అప్పుడు పరమేశ్వరుడు కలహాన్ని ఆపడానికి వారివురు మధ్య ఒక ప్రకాశవంతమైన జ్యోతి స్థంభం వలే వెలిశాడు. అప్పుడు శివుడు, బ్రహ్మ విష్ణువులతో అగ్నిస్తంభం ఆది అంతాలను కనిపెట్టమని, ఎవరు ముందుగా కనిపెడితే వారే గొప్ప అని చెప్పాడు.
అప్పుడు బ్రహ్మ ఊర్ధ్వ లోకానికి వెళ్లగా, విష్ణువు పాతాళ లోకానికి వెళ్ళాడు. విష్ణువు నిజాయతీగా తాను అగ్నిస్తంభం మొదలు కనిపెట్టలేకపోయానని ఒప్పుకుంటే, బ్రహ్మ మాత్రం తాను కనిపెట్టానని అందుకు సాక్షిగా కేతకి పుష్పాన్ని, గోవును చూపించాడు. కానీ బ్రహ్మ అబద్దమాడాడని గ్రహించిన శంకరుడు బ్రహ్మకు భూలోకంలో పూజలుండవని, కేతకి పుష్పం పూజకు పనికిరాదని శపించెను. గోవు తలతో అవునని చెప్పి, తోకతో కాదని చెప్పింది కాబట్టి గోవు తోకకు మాత్రమే పూజార్హత ఉంటుందని శపించాడు. పరమ శివుడు వెలసిన ఈ జ్యోతి స్తంభం నుంచి ఏర్పడినవే పన్నెండు జ్యోతిర్లింగాలు. స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి..
ద్వాదశ జ్యోతిర్లింగ శ్లోకం :-
సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునమ్ | ఉజ్జయిన్యాం మహాకాలమ్ ఓంకారేత్వమామలేశ్వరమ్ ||
ప్రజ్వల్యాం వైద్యనాధంచ ఢాకిన్యాం భీమ శంకరమ్ | సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే ||
వారణాశ్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే |హిమాలయేతు కేదారం ఘృష్ణేశంతు విశాలకే ||
ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః |సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ||
1. శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథక్షేత్రం మొదటగా చెప్పబడుతోంది. స్కందపురాణాన్ని అనుసరించి దక్ష ప్రజాపతిచే శాపగ్రస్తుడైన చంద్రుడు ఇక్కడే తపమాచరించి శాప విముక్తుడైనాడు.
2.శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం
మల్లికార్జున జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో శ్రీశైల పర్వతంపై వెలసిల్లుతున్నది. దీనినే దక్షిణ కైలాసం అని కూడా అంటారు. కృష్ణానదిని ఇక్కడ పాతాళగంగ అంటారు.
3.శ్రీ మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం
క్షిప్రా నదికి కుడివైపున ఉండి మధ్యప్రదేశ్ కు చెందిన ఈ ప్రసిద్ధ నగరం ద్వాదశ జ్యోతిర్లింగాలలో మహాకాళేశ్వర్ అనే పేరుతో పిలవబడుతున్నది. ప్రస్తుతం దీనిని ఉజ్జయిని అని పిలుస్తున్నారు.
4.శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం
శ్రీ ఓంకారేశ్వర్ (మధ్యప్రదేశ్) నగరంలో నర్మదా నదీ తీరాన కొలువై ఉన్న ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో నాల్గవది.
5.శ్రీ కేదార్నాథ్ జ్యోతిర్లింగం
కేదార్నాథ్ జ్యోతిర్లింగంఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వత శ్రేణులలో, మందాకినీ నదీ తీరాన కొలువై ఉన్న అత్యంత పవిత్రమైన క్షేత్రం.
6.శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం
భీమశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని పూణే సమీపంలో సహ్యాద్రి పర్వత శ్రేణులలో భీమా నది పుట్టిన చోట కొలువై ఉన్న పవిత్ర క్షేత్రం.
7.శ్రీ కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం
కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం (ఉత్తరప్రదేశ్) గంగానది తీరాన కొలువై ఉన్న అత్యంత పవిత్రమైన, పురాతనమైన పరమశివుని క్షేత్రం. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఏడవది
8.శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం
త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో బ్రహ్మగిరి పర్వతాల పాదాల వద్ద, గోదావరి నది (గౌతమీ తటం) పుట్టిన చోట కొలువై ఉన్న విశిష్టమైన క్షేత్రం . ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఎనిమిదవది.
9.శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం
వైద్యనాథ జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఐదవది. ఈ క్షేత్రం యొక్క స్థానం గురించి రెండు ప్రధాన నమ్మకాలు ఉన్నాయి.
10.శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం
నాగేశ్వర జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో పదవది. ఈ క్షేత్రం గుజరాత్‌లోని ద్వారకకు సమీపంలో 'దారుకావనం' అనే ప్రాంతంలో కొలువై ఉంది.
11.శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం
రామేశ్వర జ్యోతిర్లింగం (తమిళనాడు) భారతదేశానికి దక్షిణాన హిందూ మహాసముద్ర తీరాన కొలువై ఉన్న అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం.
12.శ్రీ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం
ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో ఎల్లోరా గుహల చెంత కొలువై ఉన్న పవిత్ర క్షేత్రం.