శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం
కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం
కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం (ఉత్తరప్రదేశ్) గంగానది తీరాన కొలువై ఉన్న అత్యంత పవిత్రమైన, పురాతనమైన పరమశివుని క్షేత్రం. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఏడవది .
పురాణాల ప్రకారం, ఈ సృష్టిని నిర్మించే సమయంలో బ్రహ్మదేవునికి, విష్ణుమూర్తికి మధ్య "ఎవరు గొప్ప?" అనే వివాదం తలెత్తినపుడు, పరమశివుడు అంతం లేని ఒక పెద్ద"జ్యోతి స్తంభం" రూపంలో వారిద్దరి మధ్య ప్రత్యక్షమయి స్తంభం యొక్క మొదలును, చివరను కనుగొనాలని వారికి చెప్పాడు. ఈ క్రమంలో ఇరువురూ ఎంత దూరం వెళ్ళినా ఆ జ్యోతి స్తంభం యొక్క అంతాన్ని కనుగొనలేకవిష్ణుమూర్తి తన ఓటమిని అంగీకరించగా, బ్రహ్మదేవుడు అసత్యం పలికి శాపగ్రస్తుడైయ్యాడు. అప్పుడు శివుడు తన నిజరూపంతో వ్యక్తమై, ఆ జ్యోతి స్తంభం యొక్క ఒక చిన్న భాగాన్ని భూమిపై శాశ్వతంగా ఉంచాడు. అదేకాశీ జ్యోతిర్లింగం. స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి..
శ్లోకం :-
సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందమ్ |
వారణాసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే ||
భావం :-
ఆనందవనంగా పిలవబడే పవిత్ర కాశీ నగరంలో సంతోషంగా నివసిస్తూ, భక్తులకు ఆనందాన్ని ప్రసాదించి, ఆశ్రయం లేనివారికి ఆశ్రయమై, సమస్త పాపసమూహాలను నాశనం చేసేవాడైన ఆ వారణాసి నాథుడైన 'శ్రీ విశ్వనాథ స్వామిని' నేను శరణు వేడుకుంటున్నాను.
పూజా ఫలితం :-
కాశీ క్షేత్రంలో మరణించే ప్రతి జీవి చెవిలో పరమశివుడు స్వయంగా "తారక మంత్రాన్ని" ఉపదేశించి, వారికి పునర్జన్మ లేని ముక్తినిప్రసాదిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి.గంగానదిలో స్నానం ఆచరించి, విశ్వనాథుడిని, విశాలాక్షి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల కోటి జన్మల పాపాలైనా తక్షణమే తొలగిపోతాయి.