శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

శ్రీ లక్ష్మీదేవి

Pineapple

శ్రీ లక్ష్మీదేవి హిందూ ధర్మంలో అష్టైశ్వర్యాలు, సంపద, సౌభాగ్యం మరియు వైభవానికి అధిష్ఠాన దేవత. ఆమె శ్రీమహావిష్ణువు అర్ధాంగి (జగన్మాత).

పురాణాల ప్రకారం, దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం వాసుకిని తాడుగా, మందర పర్వతాన్ని కవ్వంగా చేసి "క్షీరసాగర మథనం" చేసినపుడు సముద్రం నుండి కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం వంటి ఎన్నో దివ్య వస్తువులతో పాటు అత్యంత సుందరమైన రూపంతో, చేతిలో పద్మాన్ని ధరించి లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆమె పుట్టగానే మునులు, దేవతలు కీర్తించారు. దిగ్గజాలు ఆమెకు పవిత్ర జలాలతో అభిషేకం చేశాయి. లక్ష్మీదేవి దేవదానవులందరినీ పరిశీలించి, చివరకు సర్వగుణ సంపన్నుడైన శ్రీమహావిష్ణువును తన భర్తగా వరించి, ఆయన వక్షఃస్థలంలో స్థిరపడింది. స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి.

శ్లోకం : -

లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీమ్ |దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురామ్ ||శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరామ్ |త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ ||

భావం : -

క్షీరసాగర రాజపుత్రిక, శ్రీరంగధాముడైన విష్ణుమూర్తి హృదయేశ్వరి, ముల్లోకాలకు ఒకేఒక్క దీపశిఖ వంటిది, ఎవరి కటాక్ష చూపు వల్ల బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు తమతమ పదవులను, వైభవాలను పొందారో, విష్ణువుకు అత్యంత ప్రియమైన ఆ జగన్మాత లక్ష్మీదేవికి నేను నమస్కరిస్తున్నాను.

పూజా ఫలితం : -

నిత్యం లేదా శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంట్లోని అలక్ష్మి (దారిద్ర్యం) తొలగిపోయి ఆర్థిక ఇబ్బందులు నశిస్తాయి. ఇల్లాలు లక్ష్మీదేవిని ఆరాధిస్తే కుటుంబంలో ప్రశాంతత, భార్యాభర్తల మధ్య అనురాగం పెరిగి దీర్ఘసుమంగళి ప్రాప్తి కలుగుతుంది.