శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

శ్రీ కమలాత్మిక దేవి

Kalika Devi

శ్రీ కమలాత్మిక దేవి:-

దశమహావిద్యలలో పదవ మరియు చివరి మహావిద్యగా శ్రీ కమలాత్మికా దేవి అత్యంత పూజ్యనీయమైన దేవత. సంపద, శ్రేయస్సుకు అధిదేవతగా కొలువబడుతున్నారు. లక్ష్మీదేవి యొక్క దివ్య స్వరూపంగా భావించే ఈ తల్లిని ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని భక్తుల నమ్మకం. దేవి నాలుగు చేతులతో, బంగారు కాంతితో, పద్మాసనంలో కూర్చుని దర్శనమిస్తుంది. రెండు చేతుల్లో తామర పువ్వులు, ఒక చేతిలో అమృత కలశం ధరించి, మరొక చేతితో భక్తులను ఆశీర్వదిస్తుంది. లక్ష్మీదేవిలాగే ఈమె భౌతిక సంపదనే కాక, ఆధ్యాత్మిక పరిపూర్ణతను, విజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అప్పుల బాధల నుంచి విముక్తి, వ్యాపార వృద్ధి కోసం ఈమె పూజ అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది.

శ్రీ కమలాత్మికాదేవిని ఆరాదిస్తే సకలవిధ సంపదల్ని పుత్రపౌత్రాభివృద్ధిని, సుఖసంతోషాల్ని సాధకుడికి శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది. శుక్రునకు అంతరిక్ష అధిదేవత కమలాత్మకాదేవి. జీవితంలో సుఖాలు పొందాలన్నా, కళాకారునిగ రాణించాలన్నా, ప్రేమ వ్యవహారాలు ఫలించాలన్నా, కమలామహావిద్య స్తోత్రం, కవచం, హృదయం పారాయణ చేస్తూ వుంటే సత్ఫలితాలు కలుగుతాయి. భరణి, పూర్వ ఫాల్గుణి, పూర్వ ఆషాఢ నక్షత్రం వారు ఈ అమ్మవారిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయని పురాణాలు ఘోషిస్తున్నాయి. స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి..

శ్లోకం :-

ఓంకారరూపిణీ దేవి విశుద్ధసత్త్వరూపిణీ | దేవానాం జననీ త్వం హి ప్రసన్నా భవ సుందరి

తన్మాత్రం చైవ భూతాని తవ వక్షఃస్థలం స్మృతమ్ |త్వమేవ వేదగమ్యా తు ప్రసన్నా భవ సుందరి

భావం :-

ఓ అమ్మా! నీవు సృష్టికి మూలమైన ఓంకార స్వరూపిణివి. ఎటువంటి మాలిన్యం లేని పవిత్ర సత్త్వగుణానివి. దేవతలందరికీ జన్మనిచ్చిన జగన్మాతవు నీవే. ఈ విశ్వంలోని పంచభూతాలు, వాటి శక్తులు అన్నీ నీ హృదయం నుండే ఉద్భవించి, నీలోనే ఇమిడి ఉన్నాయి. కేవలం వేదాల ద్వారా మాత్రమే తెలుసుకోదగిన పరమ సత్యానివి నీవే. ఓ తల్లీ, నీ చల్లని చూపులతో నాపై ప్రసన్నురాలవు కావాలి!" అని భక్తుడు ఈ శ్లోకం ద్వారా అమ్మవారిని ప్రార్థిస్తున్నాడు.