శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

సోమనాథ జ్యోతిర్లింగం

Back

సోమనాథ జ్యోతిర్లింగం

Pineapple

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథక్షేత్రం మొదటగా చెప్పబడుతోంది. స్కందపురాణాన్ని అనుసరించి దక్ష ప్రజాపతిచే శాపగ్రస్తుడైన చంద్రుడు ఇక్కడే తపమాచరించి శాప విముక్తుడైనాడు. చంద్రుని తపస్సు కారణంగా పరమశివుడు ఈ క్షేత్రంలో సోమనాథునిగా వెలిశాడు. స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం - శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి.

శ్లోకం :-

సౌరాష్ట్రదేశే విశదేతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసమ్ |

భక్తప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే ||

భావం :-

అత్యంత నిర్మలమైన, మనోహరమైన సౌరాష్ట్ర ప్రాంతంలో స్వయంప్రకాశిత జ్యోతి స్వరూపుడై, చంద్రకళను ఆభరణంగా ధరించి సోమనాదుడిగా అవతరించిన స్వామిని నేను శరణు వేడుకుంటున్నాను.

పూజా ఫలితం :-

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా మానసిక మరియు శారీరక రుగ్మతల నుండి ఉపశమనం లభిస్తుంది.