శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

జోగులాంబ

సోమనాథ జ్యోతిర్లింగం

శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయం (తెలంగాణలోని ఆలంపూర్) ఆదిశంకరాచార్యులు పేర్కొన్న అష్టాదశ (18) శక్తిపీఠాలలో ఐదవ శక్తిపీఠం. తుంగభద్ర, కృష్ణా నదుల సంగమ తీరాన కొలువై ఉన్న ఈ దేవిని సకల విఘ్నాలను, దారిద్ర్యాన్ని తొలగించే ఉగ్ర స్వరూపిణిగా మరియు యోగశక్తి ప్రదాతగా పూజిస్తారు. దక్షయజ్ఞం తర్వాత సతీదేవి పవిత్ర శరీరాన్ని విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఖండించినప్పుడు, అమ్మవారి "పై దవడ మరియు పళ్ళు" పడిన పవిత్ర స్థలమిది. ఆలంపూర్ క్షేత్రాన్ని "దక్షిణ కాశి" గా మరియు నవబ్రహ్మ ఆలయాల నిలయంగా పిలుస్తారు. ఇక్కడ పరమశివుడు 'బాలబ్రహ్మేశ్వరుడు' గా వెలిశాడు. స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి..

శ్లోకం : -

"అలంపురే జోగులాంబా, శ్రీశైలే మల్లికార్జునీ |

కోల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా ||"

భావం : -

ఆలంపూర్ (అలంపురం) క్షేత్రంలో 'శ్రీ జోగులాంబా దేవి' గా, శ్రీశైలంలో 'మల్లికార్జుని' (భ్రమరాంబిక) గా, కొల్హాపూర్‌లో 'మహాలక్ష్మి' గా, మరియు మాహూర్‌లో 'ఏకవీరికా దేవి' గా వెలిసిన ఆ జగన్మాతకు నా ప్రణామములు.

పూజా ఫలితం : -

ఉగ్రరూపిణియైన జోగులాంబను స్మరించడం వల్ల భయాందోళనలు, మానసిక ఒత్తిడి, మరియు శతృ భయం పూర్తిగా నశిస్తాయి. ఈమె యోగినిలకు అధిపతి కావడం చేత, ఈ క్షేత్ర దర్శనం వల్ల చేతబడి, నరఘోష, మరియు దుష్ట శక్తుల పీడల నుండి శాశ్వత రక్షణ లభిస్తుంది. అమ్మవారి తలపై ఉన్న జీవుల ప్రతీకల వల్ల ఇళ్లలోని వాస్తు దోషాలు, బల్లిపాడు దోషాలు, మరియు జాతకంలోని రాహు-కేతు దోషాలు తొలగిపోతాయి.