శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

ఓంకారేశ్వర జ్యోతిర్లింగం

Back

ఓంకారేశ్వర జ్యోతిర్లింగం

Pineapple

శ్రీ ఓంకారేశ్వర్ (మధ్యప్రదేశ్) నగరంలో నర్మదా నదీ తీరాన కొలువై ఉన్న ఓంకారేశ్వర జ్యోతిర్లింగంద్వాదశ జ్యోతిర్లింగాలలో నాల్గవది.

శివపురాణం ప్రకారం, పూర్వం నారద మహర్షి వింధ్య పర్వతానికి వెళ్ళినప్పుడు, మేరు పర్వతం కంటే తానే గొప్పవాడినని వింధ్య పర్వతం అహంకారం ప్రదర్శించింది. మేరు పర్వతానికి ఉన్న శ్రేష్ఠత నీకు లేదని నారదుడు చెప్పడంతో, వింధ్య పర్వతం తన తప్పు తెలుసుకుని శివుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం నర్మదా నదీ తీరాన పార్థివ లింగాన్ని ప్రతిష్ఠించి, కఠోరమైన తపస్సు చేయగా పరమశివుడు లోకకల్యాణం కోసం అక్కడ ఓంకార రూప పర్వతంపై శివుడు జ్యోతిర్లింగంగా వెలిశాడు. స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి..

శ్లోకం :-

ఓంకారమమలేశ్వరం రమ్యం నర్మదాతటసంస్థితమ్ |గుహాయాం నివసంతం తం వందే పరమేశ్వరమ్ ||

భావం :-

నర్మదా నదీ తీరాన, సుందరమైన గుహలో కొలువై ఉండి, సమస్త జీవుల పాపాలను హరిస్తూ 'ఓంకారేశ్వరుడు' మరియు 'అమరేశ్వరుడు'అనే రెండు రూపాలలో ప్రకాశిస్తున్న ఆ పరమేశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను.

పూజా ఫలితం :-

ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్లసమస్త పాపాలు నశించి, మోక్షం సిద్ధిస్తుంది. నర్మదా నదిలో స్నానం చేసి ఓంకారేశ్వరుడిని దర్శిస్తే అజ్ఞానం తొలగి ఆత్మజ్ఞానం కలుగుతుందని భక్తుల నమ్మకం.