శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
అష్టాదశ శక్తి పీఠాలు
అష్టాదశ శక్తి పీఠాలు :-
సనాతన ధర్మంలోశ్రీ లలితా త్రిపుర సుందరి దేవి (రాజరాజేశ్వరి లేదా షోడశిగా పిలువబడే) అత్యంత ప్రధానమైన శక్తి స్వరూపిణి. ఆమెకు భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రధాన ఆలయాలైన త్రిపుర,ఉత్తర ప్రదేశ్ లోని నైమిశారణ్యం లో గల దేవాలయాల నమూనాలు,మూలవిరాఠ్ నమూనాలను అనుసరించి ఓం శివ శక్తి పీఠం నందు లలితా దేవి ప్రధాన ఆలయంగా ఉపలయలుగా అష్టాదశ శక్తిపీఠఆలయాలు నిర్మించడం జరిగింది.
హిందూ పురాణాల ప్రకారం, దక్ష ప్రజాపతి నిర్వహించిన యజ్ఞంలో తండ్రి దక్షుడు సతీదేవిని మరియు శివుడుని అందరి ముందు తీవ్రంగా అవమానిస్తాడు. పతికి జరిగిన అవమానాన్ని, తండ్రి చేసిన ద్రోహాన్ని తట్టుకోలేక సతీదేవి తీవ్ర మనోవేదనకు గురై, అక్కడికక్కడే ఆయజ్ఞ గుండంలోదూకి ప్రాణత్యాగం చేస్తుంది.ఈ వార్త తెలిసిన శివుడు తీవ్ర ఆగ్రహోదగ్రుడవుతాడు. ఆయన క్రోధం నుండి 'వీరభద్రుడు', 'భద్రకాళి' జన్మించి దక్షుడి యజ్ఞాన్ని ధ్వంసం చేస్తారు, దక్షుడి తల నరికేస్తారు.కానీ, సతీదేవి వియోగాన్ని భరించలేక సతీదేవి దేహాన్ని భుజంపై వేసుకుని, దుఃఖంతోముల్లోకాలూ తిరుగుతూ ప్రళయ తాండవం చేస్తున్న శివుడి ఉగ్ర రూపం వల్ల సృష్టి అంతా అంతమైపోయే పరిస్థితి వస్తుంది.సృష్టిని కాపాడటానికి మరియు శివుడిని ఆ మోహం, దుఃఖం నుండి బయటకు తీసుకురావడానికి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు.అలా సతీదేవి శరీర భాగాలు, ఆమె ధరించిన ఆభరణాలు భూమిపై మొత్తం 108 ప్రదేశాలలో పడ్డాయివాటినే "శక్తి పీఠాలు" అంటారు. అందులో అత్యంత ప్రధానమైనవి18 శక్తిపీటాల అమ్మవార్లైన శాంకరి, కామాక్షి, శృంఖల, చాముండేశ్వరి, జోగులాంబ, భ్రమరాంబికా, మహాలక్ష్మి, రేణుకా దేవి (ఏకవీరికా), మహాకాళి , పురుహూతికా, బిరజా దేవి, మాణిక్యాంబ, కామాఖ్య, మాధవేశ్వరి, జ్వాలాముఖి, సర్వమంగళ, విశాలాక్షి, శారదా దేవి ఉపాలయలను లలితా దేవి ప్రధాన ఆలయంగా ఓం శివ శక్తి పీఠంనందు ప్రతిష్టించడమైనది.ప్రసిద్దమైన ఆలయ నమూనాలు,మూలవిరాఠ్ నమూనాల దేవతల స్వరూపాలు అనుసరించి “ఓం శివశక్తిపీఠం– శంబాల నగర్” నందు ప్రతిష్టించడం జరిగింది.
శ్లోకం :-
లంకాయాం శాంకరీదేవీ కామాక్షీ కాంచికాపురే । ప్రద్యుమ్నే శృంఖళాదేవీ చాముండీ క్రౌంచపట్టణే ॥
అలంపురే జోగుళాంబా శ్రీశైలే భ్రమరాంబికా । కొల్హాపురే మహాలక్ష్మీ ముహుర్యే ఏకవీరా ॥
ఉజ్జయిన్యాం మహాకాళీ పీఠికాయాం పురుహూతికా । ఓఢ్యాయాం గిరిజాదేవీ మాణిక్యా దక్షవాటికే ॥
హరిక్షేత్రే కామరూపీ ప్రయాగే మాధవేశ్వరీ । జ్వాలాయాం వైష్ణవీదేవీ గయా మాంగళ్యగౌరికా ॥
వారణాశ్యాం విశాలాక్షీ కాశ్మీరేతు సరస్వతీ । అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్ ॥
సాయంకాలే పఠేన్నిత్యం సర్వశత్రువినాశనమ్ । సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభమ్ ॥
1. శాంకరి - శ్రీలంక
శ్రీ శాంకరీ దేవి ఆలయం (శ్రీలంకలోని త్రింకోమలి)ఆదిశంకరాచార్యులు పేర్కొన్న అష్టాదశ (18) శక్తిపీఠాలలోమొట్టమొదటి శక్తిపీఠం.
2. కామాక్షి - కంచి
కాంచీపురం (తమిళనాడు) నగరంలో కొలువై ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయం ఆదిశంకరాచార్యులు పేర్కొన్న అష్టాదశ (18) శక్తిపీఠాలలో రెండవది.
3. శృంఖల - ప్రద్యుమ్న నగరం
శ్రీ శృంఖలా దేవి ఆలయం (పశ్చిమ బెంగాల్‌లోని ప్రద్యుమ్న నగరం) ఆదిశంకరాచార్యులు పేర్కొన్న అష్టాదశ (18) శక్తిపీఠాలలో మూడవ శక్తిపీఠం.
4. చాముండేశ్వరి - మైసూరు
శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయం (కర్ణాటకలోని మైసూరు) ఆదిశంకరాచార్యులు పేర్కొన్న అష్టాదశ (18) శక్తిపీఠాలలో నాల్గవ శక్తిపీఠం.
5. జోగులాంబ - ఆలంపూర్
శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయం (తెలంగాణలోని ఆలంపూర్) ఆదిశంకరాచార్యులు పేర్కొన్న అష్టాదశ (18) శక్తిపీఠాలలో ఐదవ శక్తిపీఠం.
6. భ్రమరాంబికా - శ్రీశైలం
శ్రీ భ్రమరాంబికా అమ్మవారి ఆలయం (ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం)ఆదిశంకరాచార్యులు పేర్కొన్న అష్టాదశ (18) శక్తిపీఠాలలో ఆరవ శక్తిపీఠం.
7. మహాలక్ష్మి - కొల్హాపూర్
శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం (మహారాష్ట్రలోని కొల్హాపూర్) ఆదిశంకరాచార్యులు పేర్కొన్న అష్టాదశ (18) శక్తిపీఠాలలో ఏడవ శక్తిపీఠం .
8. రేణుకా దేవి (ఏకవీరికా) - మహుర్
శ్రీ రేణుకా దేవి ఆలయం (మహారాష్ట్రలోని మాహూర్) ఆదిశంకరాచార్యులు పేర్కొన్న అష్టాదశ (18) శక్తిపీఠాలలో ఎనిమిదవ శక్తిపీఠం.
9. మహాకాళి - ఉజ్జయిని
శ్రీ మహాకాళి అమ్మవారి ఆలయం (మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని) ఆదిశంకరాచార్యులు పేర్కొన్న అష్టాదశ (18) శక్తిపీఠాలలో తొమ్మిదవ శక్తిపీఠం.
10. పురుహూతికా - పిఠాపురం
శ్రీ పురుహూతికా దేవి ఆలయం (ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురం) ఆదిశంకరాచార్యులు పేర్కొన్న అష్టాదశ (18) శక్తిపీఠాలలో పదవ శక్తిపీఠం.
11. బిరజా దేవి (గిరిజా దేవి) - జాజ్పూర్
శ్రీ బిరజా దేవి (గిరిజా దేవి) ఆలయం (ఒడిశాలోని జాజ్‌పూర్) ఆదిశంకరాచార్యులు పేర్కొన్న అష్టాదశ (18) శక్తిపీఠాలలో పదకొండవ శక్తిపీఠం.
12. మాణిక్యాంబ - ద్రాక్షారామం
శ్రీ మాణిక్యాంబా దేవి ఆలయం (ఆంధ్రప్రదేశ్‌లోని ద్రాక్షారామం) ఆదిశంకరాచార్యులు పేర్కొన్న అష్టాదశ (18) శక్తిపీఠాలలో పన్నెండవ శక్తిపీఠం.
13. కామాఖ్య - గౌహతి
శ్రీ కామాఖ్యా దేవి ఆలయం (అస్సాంలోని గౌహతి) ఆదిశంకరాచార్యులు పేర్కొన్న అష్టాదశ (18) శక్తిపీఠాలలో పదమూడవ శక్తిపీఠం.
14. మాధవేశ్వరి - ప్రయాగ
శ్రీ మాధవేశ్వరి దేవి ఆలయం (ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ / ప్రయాగ్‌రాజ్) ఆదిశంకరాచార్యులు పేర్కొన్న అష్టాదశ (18) శక్తిపీఠాలలో పద్నాలుగవ శక్తిపీఠం.
15. జ్వాలాముఖి (హిమాచల్ ప్రదేశ్)
శ్రీ జ్వాలాముఖి దేవి ఆలయం (హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా) ఆదిశంకరాచార్యులు పేర్కొన్న అష్టాదశ (18) శక్తిపీఠాలలో పదిహేనవ శక్తిపీఠం.
16. సర్వమంగళ - గయ
శ్రీ సర్వమంగళ దేవి ఆలయం (బీహార్‌లోని గయ) ఆదిశంకరాచార్యులు పేర్కొన్న అష్టాదశ (18) శక్తిపీఠాలలో పదహారవ శక్తిపీఠం.
17. విశాలాక్షి - వారణాసి
శ్రీ విశాలాక్షి అమ్మవారి ఆలయం (ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి / కాశీ) ఆదిశంకరాచార్యులు పేర్కొన్న అష్టాదశ (18) శక్తిపీఠాలలో పదిహేడవ శక్తిపీఠం.
18. శారదా పీఠం - షార్దా, కశ్మీర్
శ్రీ శారదా పీఠం (సరస్వతీ దేవి శక్తిపీఠం) ఆదిశంకరాచార్యులు పేర్కొన్న అష్టాదశ (18) శక్తిపీఠాలలో ఆఖరిదైన పద్దెనిమిదవ శక్తిపీఠం.