శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

తారా దేవి

Kalika Devi

తారా దేవి:-

తారా దేవి "దశమహావిద్యలలో" రెండవ రూపం. తార అనే సంస్కృత పదానికి "నక్షత్రం" మరియు "దాటించడం" అని అర్థం. సంసారం అనే భవసాగరాన్ని (జీవిత కష్టాలను) దాటించే తల్లిగా ఆమెను భక్తులు కొలుస్తారు. ఆమె జ్ఞానం, కరుణ మరియు రక్షణకు ప్రతీక. ఒడిశాలోని గంజాంలో ఉన్న తార తారిణి ఆలయం . ఇది కుమారి కొండలపై నెలకొని ఉంది మరియు దశ మహావిద్యతో సంబంధం ఉన్న ఒక ప్రధాన ప్రాచీన కేంద్రం. తారాదేవి సాధనవల్ల.. శత్రునాశనం, దివ్యజ్ఞానం, వాక్సిద్ధి, ఐశ్వర్యం, కష్టనివారణ సాధకుడికి లభిస్తుంది. గురుగ్రహానికి అంతరిక్ష అధిదేవత తారామహాదేవి. స్త్రీలకు భర్త సుఖం, సాంఘికంగా ఉన్నతి, ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినపుడు, పరిస్థితులు చేజారిపోయినపుడు ఈ శక్తిని ఆరాదిస్తే బాధ నివారణ జరుగుతుంది. బృహస్పతి పునర్వసు, విశాఖ, పూర్వ భాద్రపద నక్షత్రం వారు ఈ అమ్మవారిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయని పురాణాలు ఘోషిస్తున్నాయి. స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి..

శ్లోకం :-

ప్రఫుల్ల నీలోత్పల కోమలాంగామ్ నవోదితాదిత్య నిభాననాభామ్ |

లలాట దేశే జ్వలదగ్ని రూపామ్ భజే త్రిణేత్రామ్ త్రిజగజ్జనానీమ్ ||

భావం :-

వికసించిన నీలి కలువ పువ్వుల వలె సున్నితమైన శరీరం కలిగినది, ఉదయిస్తున్న సూర్యుని కాంతి వంటి ముఖ వర్చస్సు కలిగినది, లలాటము నందు మండుతున్న అగ్ని జ్వాలల వంటి తేజస్సుతో వెలిగిపోతున్నది, ముక్కన్నులు కలిగినది అయినటువంటి, త్రిలోకములకు తల్లి అయిన శ్రీ తారాదేవిని నేను భజిస్తున్నాను.