శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
సర్వమంగళ
శ్రీ సర్వమంగళ దేవి ఆలయం (బీహార్‌లోని గయ) ఆదిశంకరాచార్యులు పేర్కొన్న అష్టాదశ (18) శక్తిపీఠాలలో పదహారవ శక్తిపీఠం. ఫల్గు నదీ తీరాన, 'భస్మకూట పర్వతం' (మంగళగౌరి కొండ) పై కొలువై ఉన్న ఈ ఆలయాన్ని స్థానికంగా 'మా మంగళ గౌరీ ఆలయం' అని పిలుస్తారు. పితృకార్యాలకు అత్యంత ప్రసిద్ధమైన గయా క్షేత్రంలో ఈ శక్తిపీఠం విరాజిల్లుతోంది.
దక్షయజ్ఞం తర్వాత సతీదేవి పవిత్ర శరీరాన్ని విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఖండించినప్పుడు, అమ్మవారి "స్తన భాగం" పడిన పరమ పవిత్రమైన స్థలమిది. హిందూ శాస్త్రాల ప్రకారం అమ్మవారి శరీరంలోని ఈ భాగం ఇక్కడ పడటం వల్ల, ఈమెను సృష్టిని సాకే, పాలిచ్చే అమృతమూర్తిగా, సకల జీవుల "పోషణకు ప్రతీక" గా ఆరాధిస్తారు. ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యత పద్మ పురాణం, వాయు పురాణం, అగ్ని పురాణం మరియు దేవీ భాగవత పురాణాలలో అత్యంత పవిత్రంగా వర్ణించబడింది. స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి.
శ్లోకం : -
""హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ |
జాలాముఖ్యాం మహాదేవీ, కాశ్మీరేషు సరస్వతీ ||
గయాయాం మంగళాగౌరీ, కరవీరే మహాలక్ష్మీ |"
భావం : -
పవిత్ర గయా క్షేత్రంలో సర్వ మంగళాలను ప్రసాదించే 'శ్రీ మంగళగౌరి' (సర్వమంగళ దేవి) గా వెలిసి, భక్తులకు ధర్మార్థ కామ మోక్షాలను మరియు అక్షయమైన (నాశనం లేని) పుణ్యఫలాన్ని ఇచ్చే ఆ జగన్మాతకు నా ప్రణామములు
పూజా ఫలితం : -
'మంగళగౌరి' పేరులోనే శుభం ఉంది. వివాహం కాని యువతులు ఈమెను పూజిస్తే గుణవంతుడైన భర్త లభిస్తాడు. ముత్తైదువులు శ్రావణ మాసంలో ఇక్కడ 'మంగళగౌరి వ్రతం' ఆచరిస్తే వారి భర్తలకు ఆయురారోగ్యాలు, అఖండ మాంగల్య బలం సిద్ధిస్తాయి. గయకు వచ్చి విష్ణుపాదాల చెంత పితృకార్యాలు (పిండప్రదానం) చేసిన భక్తులు, మంగళగౌరి (సర్వమంగళ) అమ్మవారిని దర్శించుకుంటేనే ఆ పితృదేవతలకు సంపూర్ణ మోక్షం (ముక్తి) లభిస్తుందని నమ్మకం. అమృత హృదయంతో సృష్టిని పోషించే తల్లి కాబట్టి, ఈమెను దర్శిస్తే గృహంలో అన్నపానీయాలకు, సంపదకు ఎప్పుడూ లోటుండదు.