శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
శ్రీ తారకేశ్వర స్వామి వారు
ఈ భూమండలంలో ఆదిమూలంగా ఆవిర్భవించి పార్వతీదేవిని సృష్టించి తద్వారా విష్ణుమూర్తిని , బ్రహ్మను తరువాత చరాచర జగత్తును సకల ప్రాణికోటిని సృష్టించి, బ్రహ్మను సృస్తికారుకుడిగా, విష్ణువును స్థితికారకుడిగా చేసి ఈ పార్వతీపరమేశ్వరులు ఈ భూమండలమంతా అవతరించి పరమేశ్వరుడు లయకారకుడిగా ఉన్నారు. పాపపుణ్యాలు ఆధారంగా జన్మవిధానం, జీవనవిధానం జననమరణాలు, మరణజననాలు జరుగుతున్నాయి, యుగాలు గడుస్తున్నాయి.
తారకేశ్వర స్వామి అనగా పరమశివుడి యొక్క ఒక పవిత్ర స్వరూపం.
పార్వతీ దేవి హిందూ సంప్రదాయంలో ఆదిపరాశక్తి స్వరూపం, లయకారుడైన పరమశివుని అర్ధాంగి. ఆమెను శక్తి, దుర్గ, గౌరి, లలిత వంటి అనేక నామాలతో భక్తులు ఆరాధిస్తారు. అంతకుముందు జన్మలో ఆమె దక్షప్రజాపతి కుమార్తెగా 'సతీదేవి' అనే నామంతో జన్మించి శివుడిని వివాహం చేసుకుంది. తండ్రి చేసిన అవమానాన్ని భరించలేక యజ్ఞవాటికలో ఆత్మహుతి చేసుకుంది. సతీదేవి తదుపరి జన్మలో హిమవంతుడు (హిమాలయాల రాజు) మరియు మేనాదేవి దంపతులకు కుమార్తెగా జన్మించింది. పర్వత రాజు పుత్రి కాబట్టి ఆమెకు 'పార్వతి' అని పేరు వచ్చింది. పరమశివుడిని భర్తగా పొందడం కోసం పార్వతీ దేవి చిన్న వయసులోనే రాజభోగాలను వదిలి, అడవిలో అత్యంత కఠినమైన తపస్సు చేసింది. ఆమె నిశ్చల భక్తికి మెచ్చి పరమశివుడు పార్వతిని వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం విశ్వకళ్యాణానికి దారితీసింది. లోకాలను పీడించే మహిషాసురుడు, చండముండులు, శుంభనిశుంభులు వంటి రాక్షసులను సంహరించడానికి పార్వతీ దేవి దుర్గ, కాళి వంటి ఉగ్ర రూపాలను ధరించింది.
స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి.
ద్వాదశ జ్యోతిర్లింగాలు