శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం

Back

మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం

Pineapple

క్షిప్రా నదికి కుడివైపున ఉండి మధ్యప్రదేశ్ కు చెందిన ఈ ప్రసిద్ధ నగరం ద్వాదశ జ్యోతిర్లింగాలలో మహాకాళేశ్వర్ అనే పేరుతో పిలవబడుతున్నది. ప్రస్తుతం దీనిని ఉజ్జయిని అని పిలుస్తున్నారు.

శివపురాణం ప్రకారం, పూర్వం వేదప్రియుడనే బ్రాహ్మణుడు ఉజ్జయినిలో నివసించేవాడు. 'దూషణుడు' అనే శక్తివంతమైన రాక్షసుడు ఆ నగరాన్ని ముట్టడించి, ధర్మాన్ని నాశనం చేస్తూ వేదప్రియుడిని, స్థానిక ప్రజలను హింసించసాగాడు.ప్రజలందరూ శివుడిని రక్షించమని వేడుకోగా, పరమశివుడు భూమిని చీల్చుకుని భయంకరమైన మహాకాలుడి రూపంలో ప్రత్యక్షమయి దూషణుడిని, అతని సైన్యాన్ని భస్మం చేశాడు. అనంతరం భక్తుల కోరిక మేరకు అక్కడే 'మహాకాళేశ్వరుడిగా' శాశ్వతంగా జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు. స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం - శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి.

శ్లోకం :-

అవంతికాయాం విహితావతారం | ముక్తిప్రదానాయ చ సజ్జనానామ్ ||

అకాలమృత్యోః పరిరక్షణార్థం | వంతే మహాకాలమహాసురేశమ్ ||

భావం :-

ఉజ్జయినీ నగరంలో భక్తుల కోసం అవతరించి... రాక్షసులను శాసించి,సన్మార్గులైన సజ్జనులకు, భక్తులకు మోక్షాన్ని ప్రసాదించి, అకాల మృత్యువు నుండి రక్షించేవాడు'మహాకాళేశ్వరుడికి' నేను నమస్కరిస్తున్నాను.

పూజా ఫలితం :-

"మహాకాలే మృత్యు నాశనం" - స్వామిని దర్శించడం లేదా స్మరించడం వల్లఅకాల మృత్యు దోషాలుతొలగిపోతాయి. దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయి. భయం, మానసిక ఆందోళనలు తొలగి ధైర్యం, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.