శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
ఓం శివ శక్తిపీఠం – శంబాల నగరం ఆలయాల విశిష్టత
ఈ భూలోకంలో పరిపూర్ణంగా వుండే సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మ భూమండలం అంతా వెలసి వారిని నమ్ముకున్న భక్తులకు అండగా నిలిచి వారి కోరికలను, కష్టాలను తీర్చిఅనుగ్రహించున్నారు. ఎన్నో మహిమలు,అద్భుతాలుసృష్టించి భక్తులు కోరిన కోర్కెలను తీర్చుచున్నారు. ఈ భూలోకంలో పురాతనమైన స్వయంభూగా వెలసిన వివిధ పరమేశ్వరుని జ్యోతిర్లింగ ఆలయాలు, అమ్మవార్ల అష్టాదశ శక్తిపీఠాల ఆలయాలు, వివిధ రూపాలలో వెలసిన విష్ణుమూర్తి ఆలయాలు, ప్రాంతాల వారీగా వివిధ పేర్లతో స్వయంభూగా వెలసిన దేవతామూర్తులు ఆలయాలలో ఎన్నో అద్భుతమైన సంఘటనలు, నిర్మాణ రహస్యాలు ఇప్పటికీ సైన్సు కి అంతుపట్టని విధంగా ఉన్నాయి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం నాలుగు యుగాలుగా సిద్దపురుషులు,ఆదిగురువులు, యోగులు, మునులు, మహారాజులు,పీఠాధిపతులు, పండితులచే ఆయా ప్రాంతాలలో నిర్మించబడిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మరియుమహాశక్తి ఆలయాలలోఇప్పటికీ నిత్య దీపదూప నైవేద్యాలు,అర్చనలు, అభిషేకాలు, యజ్ఞయాగాలు, కళ్యాణాలు, లోక కళ్యాణార్ధం పలు కైంకర్యాలునిర్వహించడం జరుగుతుంది.
అదేవిధంగా ప్రపంచ శాంతికోసం, దేశ సౌభాగ్యంకోసం, ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షించడం కోసం, భూలోకం పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండడంకోసం, మానవాళిని ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, శాంతియుతంగా, ప్రేమాయుతంగా జీవించడం కోసం, ధనధాన్యాలు, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టఐశ్వర్యాలు,ఇష్టకార్యసిద్ధి, మనోవాంఛ ఫలసిద్ధి, ఉద్యోగ వ్యాపారాభివృద్ది, వంశాభివృద్ది, లోకం సుభిక్షంగా ఉండి లోక కళ్యాణం కొరకుఆదిగురువులు, సిద్దగురువులు,రాజయోగులు,పీఠాధిపతులు, మఠాదిపతులు, పండితులు, ఆధ్యాత్మికవేత్తలఆధ్వర్యంలో స్వయంభూగా వెలసిన ప్రముఖ ఆలయనమూనాలు,మూలవిరాఠ్ నమూనాల దేవతల స్వరూపాలు అనుసరించి శైవం, వైష్ణవం, శాక్తేయం, గాణాపత్యం, సౌరం, కౌమారం మొదలగు హిందూమతంలో ఉండే దైవ శాస్త్రాల ప్రకారం అన్ని దేవతలకు విడివిడిగా దేవాలయాలు, లోకంలో ఉండే షణ్మతదేవతల్ని వేద, శివాగమ, వైష్ణవాగమ,శిల్ప శాస్త్రానుసారంగా“శ్రీశ్రీశ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్యలహరి మహాసంస్థాన ఆశ్రమము”వారిచే “ఓం శివశక్తి పీఠం– శంబాల నగర్” లోశైవ, వైష్ణవ, మహాశక్తితొంబై ఆరు (96)దేవాలయాలు,నూట ముప్పై ఎనిమిది (138) దేవతామూర్తులనుయంత్ర-మంత్ర-తంత్రములతో2015 జనవరి 26 నుండిఅంచెలంచెలుగా వివిధ సమయాలలో ప్రతిష్టించడమైనది.
ఈ క్షేత్రంలో ఆలయాలు శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం, శ్రీశ్రీశ్రీ తారకేశ్వరస్వామి ఆలయం, శ్రీశ్రీశ్రీ తారకేశ్వరిదేవి అమ్మవారి ఆలయం, శ్రీ సోమనాధ లింగం ఆలయం, శ్రీ మల్లిఖార్జున లింగం ఆలయం, శ్రీ మహకాళేశ్వర లింగం ఆలయం, శ్రీ ఓంకారేశ్వర లింగం ఆలయం, శ్రీ వైద్యనాధలింగేశ్వర ఆలయం, శ్రీ భీమశంకర లింగం ఆలయం, శ్రీ రామేశ్వర లింగం ఆలయం, శ్రీ నాగేశ్వర లింగం ఆలయం, శ్రీ విశ్వేశ్వర లింగం ఆలయం, శ్రీ త్రయంబకేశ్వర లింగం ఆలయం, శ్రీకేధారేశ్వర లింగం ఆలయం, శ్రీ ఘృష్ణేశ్వర లింగం ఆలయం, శ్రీ పంచభూత లింగం (పశుపతినాధ) ఆలయం, శ్రీ వల్లీదేవసేన షణ్ముఖ స్వామి దేవాలయం, సతీసమేతంగా, వాహన సమేతంగా నవగ్రహాలు ఆలయం, శ్రీ కాలభైరవ ఆలయం, చండీశ్వరుని ఆలయం, నాట్య గణపతి ఆలయం, దక్షిణామూర్తి ఆలయం, లింగోద్భవ మూర్తి ఆలయం, బ్రహ్మ ఆలయం, గౌరీ ఆలయం, చర , స్థిర నందీశ్వరుల ఆలయం, శ్రీ భూదేవి శ్రీదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయం, శ్రీ సద్గురు సాయిబాబా మందిరం, శ్రీ కోదండరామాలయం, శ్రీ రమా సత్యనారాయణస్వామి దేవాలయం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం, శ్రీ సూర్యనారాయణమూర్తి ఆలయం, శ్రీ నాగదేవత ఆలయం, శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం, శ్రీ అయ్యప్పస్వామి దేవాలయం, శ్రీ అష్టలక్ష్మీ సహిత లక్ష్మీదేవి ఆలయం, శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయం, శ్రీ గాయత్రీ దేవి ఆలయం, శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి పీఠం, ఆలయం, శ్రీ శాంకరీదేవి పీఠం, ఆలయం, శ్రీ కామాక్షిదేవి పీఠం, ఆలయం, శ్రీ శంకులాదేవి పీఠం, ఆలయం, శ్రీ చాముండేశ్వరీదేవి పీఠం, ఆలయం, శ్రీ జోగులాంబదేవి పీఠం, ఆలయం, శ్రీ బ్రమరాంభికాదేవి పీఠం, ఆలయం, శ్రీ మహాలక్ష్మీదేవి పీఠం, ఆలయం, శ్రీ ఏకానీరాదేవి పీఠం, ఆలయం, శ్రీ మహంకాళీదేవి పీఠం, ఆలయం, శ్రీ పురుహుతికాదేవి పీఠం, ఆలయం, శ్రీ గిరిజాదేవి పీఠం, ఆలయం, శ్రీ మాణిక్యాంబదేవి పీఠం, ఆలయం, శ్రీ కామరూపిణీదేవి పీఠం, ఆలయం, శ్రీ మారవీశ్వరీ దేవి పీఠం, ఆలయం , శ్రీ వైష్ణవీదేవి పీఠం, ఆలయం, శ్రీ మంగళ గౌరిదేవి వీరం, ఆలయం, శ్రీ విశాలాక్షిదేవి పీఠం, ఆలయం, శ్రీ సరస్వతిదేవి పీఠం, ఆలయం, శ్రీ చండీ సదాశివ పీఠం, సదా శివ మూర్తి మరియు చండికా ఆలయం, వారాహి అమ్మవారి ఆలయము, రాజశ్యామల అమ్మవారి ఆలయం, శ్రీ కాళికా దేవి అమ్మవారి ఆలయం,శ్రీ తారా దేవి అమ్మవారి ఆలయం,శ్రీ త్రిపుర భైరవి అమ్మవారి ఆలయం, శ్రీ ధుమావతిఅమ్మవారి ఆలయం,శ్రీ చిన్న మస్థ దేవి అమ్మవారి ఆలయం,శ్రీ షోడసి దేవి అమ్మవారి ఆలయం,శ్రీ భువనేశ్వరిఅమ్మవారి ఆలయం,శ్రీ బగలాముఖిఅమ్మవారి ఆలయం,శ్రీ రాజమాతంగిఅమ్మవారి ఆలయం,శ్రీ కమలాత్మికఅమ్మవారి ఆలయం,బ్రాహ్మణిఅమ్మవారి ఆలయం,మహేశ్వరిఅమ్మవారి ఆలయం,కౌమారిఅమ్మవారి ఆలయం,వైష్ణవిఅమ్మవారి ఆలయం,ఇంద్రానిఅమ్మవారి ఆలయం,చాముండిఅమ్మవారి ఆలయం,మానస దేవి ఆలయం, ప్రత్యంగరి దేవిఅమ్మవారి ఆలయం,రాజరాజేశ్వరిఅమ్మవారి ఆలయం,రాధా కృష్ణులు అమ్మవారి ఆలయం,36 అడుగుల సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం, 36 అడుగుల కాలభైరవ స్వామి వారి ఆలయం, ఇంద్రుడు ఆలయం,అగ్ని దేవుడు ఆలయం,యముడు ఆలయం, నివ్రుత్తుడు ఆలయం,వరుణుడు ఆలయం,వాయుదేవుడు ఆలయం, కుబేరుడు ఆలయం,ఈశ్వరుడు ఆలయం,విష్ణు ఆలయం,బ్రహ్మ ఆలయం,సప్త నదీ జలాలతో కూడిన పుణ్య పుష్కరిణి లో కొలువైయున్న అర్ధనారీశ్వరుడు 27 అడుగుల విగ్రహం మరియు ఆలయం, వసంత మండపం మరియు 27 నక్షత్రముల నక్షత్రవనం, 9 గ్రహముల గ్రహవనం, 12 రాశుల రాశివనం, గోసాల, నిత్య అన్నదానం, దేవతాకళ్యాణమండపం, భక్తులకు ఉచితవసతి, ధ్యానపిరమిడ్కలియుగంలోనే ఏకైక హరిహర, మహాశక్తి హిందూ ఆధ్యాత్మిక ఆలయసముదాయాల విశిష్ట పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రంలోహిందూమతంలో ఉన్న అన్ని దేవతలను విడివిడిగా ఉన్న ఆలయాల్లో ఒకేసారి ఒకే ప్రాంగణంలో దర్శించే మహాభాగ్యము కలిగిన ఏకైక పుణ్యక్షేత్రం “ఓం శివశక్తి పీఠం– శంబాల నగరం”.
ఈ క్షేత్రంలో ప్రతిరోజు గోపూజ, అభిషేకము, అర్చనలు, పూజలు, బాలభోగములు, రాజభోగములు, సంద్యా భోగములు, పర్వదినములలో విశిష్ట కార్యక్రమములు, ప్రత్యేక అభిషేకములు, జపములు, అర్చనలు, హోమములు, కళ్యాణములు జరుగును.
ఈ క్షేత్రం దర్శించి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, వ్యాపారాభివృద్ధి, కళ్యాణప్రాప్తి, సంతానప్రాప్తి, విద్యాప్రాప్తి, ఉద్యోగప్రాప్తి, మనోవాంఛా ఫలసిద్ది, ఇష్ట కార్యసిద్ధి పొందుదురు. అంతేకాకుండా జాతకదోషాలు, నామనక్షత్రదోషాలు, జన్మ నక్షత్రదోషాలు, కాలసర్ప దోషాలు, ఏలినాటిశనిదోషాలు, గ్రహదోషాలు, గృహదోషాలు మరియు రాహుకేతువుల దోషములు గలవారు దోష పరిహార పూజలు, అభిషేకాలు, జపములు, హోమములు చేయించుకొని దోష పరిహారం పొందుటకు అనుకూలమైన క్షేత్రం “ఓం శివశక్తి పీఠం– శంబాల నగరం” .
ఈ క్షేత్రంలో నామకరణములు, అన్నప్రాసనలు, అక్షరాభ్యాసములు, ఉపనయనములు, వివాహములు ఉచితంగా చేసుకొనుటకు తగిన ఏర్పాట్లు కలవు. కావున దర్శించండి.. తరించండి.