శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

కాలభైరవ స్వామి

Pineapple

కాలభైరవ స్వామి :

కాలభైరవ స్వామి పరమశివుని యొక్క అత్యంత ఉగ్రమైన, శక్తివంతమైన రూపాలలో ఒకటి. ఆయనను కాశీ నగరానికి రక్షకుడిగా (కోత్వాల్) మరియు "కాలానికి (సమయానికి) అధిపతిగా" పూజిస్తారు.

శివపురాణం ప్రకారం, పూర్వం బ్రహ్మదేవునికి, విష్ణుమూర్తికి మధ్య సృష్టిలో ఎవరు గొప్ప అనే వివాదం జరిగింది. ఆ సమయంలో వేదాలు పరమశివుడే సర్వోన్నతుడు అని చెప్పాయి. కానీ, అహంకారంతో ఉన్న బ్రహ్మదేవుడు తన ఐదవ ముఖంతో శివుడిని తక్కువ చేసి మాట్లాడాడు. అప్పుడు రుద్రునిగా ఐదు ముఖాలతో, నాగాభరణాలతో , జటాజూటంతో ఇవతలికి వచ్చారు. వస్తూనే బ్రహ్మగారిని తన భృకుటి ముడివేసి తీక్షణంగా చూశారు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలే నేత్రాలుగా, సూర్యచంద్రలని కలిగిన ఆ త్రినేత్రుడు అలా కనుబొమ్మలు ముడివేయగానే, ఆ నుదుటిలో నుండీ ఉద్భవించాడు దిగంబరంగా ఉన్న ఒక నీలవర్ణ రుద్రుడు. ఆయనే కాలభైరవుడు. అష్ట భైరవులు అంటే పరమశివుని ఉగ్ర రూపమైన కాల భైరవుని యొక్క ఎనిమిది ప్రధాన వ్యక్తీకరణలు. అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీషణ భైరవుడు, సంహార భైరవుడు.. శివుని ఆజ్ఞతో కాలభైరవుడు తన చేతి గోటితో బ్రహ్మదేవుని అహంకారానికి గుర్తుగా ఉన్న ఐదవ శిరస్సును నరికివేశాడు. బ్రహ్మదేవుని శిరస్సును నరకడం వల్ల కాలభైరవునికి 'బ్రహ్మహత్యా పాతకం' చుట్టుకుంది. ఈ దోష నివారణ కోసం కాలభైరవుడు భిక్షాటన చేస్తూ ముల్లోకాలు తిరిగాడు. చివరకు పరమశివుని పవిత్ర క్షేత్రమైన కాశీ నగరంలో అడుగుపెట్టగానే, 'బ్రహ్మహత్యా పాతకం' నుండి విముక్తి పొందారు. అనంతరం పరమశివుడు కాలభైరవుడిని కాశీ నగరానికి శాశ్వత రక్షకుడిగా (క్షేత్రపాలకుడిగా) నియమించాడు. స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి..

శ్లోకం :-

దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం | వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్||

నారదాదియోగిబృందవందితం దిగంబరం | కాశికాపురాధినాథకాలభైరవం భజే ||

భావం :-

దేవేంద్రుని చేత పూజించబడే పవిత్రమైన పాదపద్మాలు కలవాడు, సర్పములను యజ్ఞోపవీతంగా ధరించినవాడు, శిరస్సుపై చంద్రవంక కలవాడు, నారదాది మునులచే స్తుతించబడేవాడు మరియు కాశీ నగరానికి అధిపతి అయిన ఆ 'శ్రీ కాలభైరవ' స్వామిని నేను భజిస్తున్నాను.

పూజా ఫలితం :-

కాలభైరవుడు సమయానికి అధిపతి. ఆయనను పూజించడం వల్ల జాతకంలోని రాహు, కేతు, మరియు శని దోషాలు తొలగిపోతాయి. శత్రు భయాలు, చేతబడి, నరఘోష వంటి దుష్ట శక్తుల పీడల నుండి విముక్తి కలుగుతుంది. కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నా, కాలభైరవుడిని దర్శించకపోతే ఆ యాత్రా ఫలం దక్కదని భక్తుల నమ్మకం.