శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

సప్త నధీ జలలతో పునీతమైన పుణ్యపుష్కరణీ

సప్త నధీ జలలతో పునీతమైన పుణ్యపుష్కరణీ యమునా, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి ఈ సప్తనదుల జలాలను కలిపి తీర్థస్నానం చేయడం అత్యంత పుణ్యఫలదాయకం అని పురాణాలు చెబుతాయి.

భారతదేశంలోని అత్యంత పవిత్రమైన సప్త నదులైన గంగ, యమున, సరస్వతి, గోదావరి, నర్మద, సింధు, మరియు కావేరి జలాలతో దీనిని నింపారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి తెచ్చిన ఈ సప్త జలాలు ఒకే చోట కలవడం వల్ల ఈ క్షేత్రానికి అపారమైన శక్తి లభించిందని నమ్ముతారు.

ఈ సప్త జలాల మధ్యలో ఉన్న అర్ధనారీశ్వరుడిని దర్శించుకుని, ఈ కోనేటి నీటిని తలపై చల్లుకుంటే సర్వపాపాలు నశించి, పుణ్యఫలం దక్కుతుందని ప్రతీతి.