శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

పడమర (పశ్చిమం): వరుణుడు (జలాధిపతి)

Back

పడమర (పశ్చిమం): వరుణుడు (జలాధిపతి)

Pineapple

హిందూ పురాణాల ప్రకారం వరుణుడు పశ్చిమ దిక్కుకు అధిపతి. అష్టదిక్పాలకులలో ఒకరైన ఈయన జలాధిపతి, అంటే సముద్రాలు, నదులు మరియు నీటి వనరులన్నింటికీ ఈయనే అధిదేవత. వేద కాలంలో వరుణుడిని విశ్వాంతరాళానికి, నైతిక నియమాలకు (ఋతం) రక్షకుడిగా అత్యున్నత స్థానంలో పూజించేవారు. వరుణుడు కశ్యప ప్రజాపతి మరియు అదితి దంపతుల కుమారుడు.స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం - శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి.

శ్లోకం :-

"పాశహస్తం జలాధీశం ప్రచేతస మపాంపతిమ్ |

మకరస్థం ప్రతీచీశం వరుణం ప్రణమామ్యహమ్ ||"

భావం :-

చేతిలో పాశాన్ని ధరించినవాడు, జలములకు అధిపతి, ప్రచేతసుడు అనే పేరు గలవాడు, మకరమును (మొసలిని) వాహనముగా చేసుకున్నవాడు మరియు పశ్చిమ దిక్కుకు రాజు అయిన ఆ వరుణ దేవునికి నేను ప్రణామం చేస్తున్నాను.