శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

శ్రీ వారాహి దేవి

Back

సోమనాథ జ్యోతిర్లింగం

శ్రీ వారాహి దేవి

శ్రీ సప్తమాతృకలలో ఐదవ వారైన శ్రీ వారాహి దేవి ఆవిర్భావం దుర్గ సప్తశతి ప్రకారం, శుంభ-నిశుంభులు మరియు రక్తబీజుడు అనే రాక్షసులతో జరిగిన మహా యుద్ధంలో జగన్మాతకు సహాయం చేయడానికి ముల్లోకాలను కాపాడే శ్రీమహావిష్ణువు యొక్క వరాహ అవతార శక్తి నుండి ఈమె ఆవిర్భవించింది. వరాహమూర్తి శక్తి స్వరూపమే ఈ "వారాహి దేవి". లలితా పరమేశ్వరి దేవి శత్రు సైన్యాన్ని అణచివేసే దండనాథగా (సేనాధిపతిగా) కూడా ఈమెను పురాణాలు కీర్తిస్తున్నాయి. స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి..

శ్లోకం :-

గృహీతోగ్రమహాచక్రే దంష్ట్రోద్ధృతవసుంధరే |

వారాహీరూపధారిణీ నారాయణి నమోస్తుతే ||

భావం :-

తన కోరలతో భూమండలాన్ని పైకి లేపి ఉద్ధరించిన, చేతిలో భయంకరమైన మహా చక్రాన్ని ధరించి, వారాహి రూపంలో ఉన్న ఓ నారాయణీ దేవి! నీకు వందనములు. నాగలి, ముసలము (రోకలి) ధరించి, మూడు కన్నులతో శోభిస్తూ, భక్తుల కోర్కెలను తీర్చే ఓ దండనాథా వారాహీ దేవి, నీకు నమస్కరిస్తున్నాను.

పూజా ఫలితం :-

శత్రువుల నుండి వచ్చే పీడలు, కుతంత్రాలు, కోర్టు వివాదాలు పూర్తిగా తొలగిపోతాయి. శత్రువులపై విజయం లభిస్తుంది. ఈమె వరాహ శక్తి కావడం వల్ల ఇల్లు, స్థలం, పొలం వంటి భూ వివాదాలు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, వ్యవసాయం చేసేవారికి అమిత లాభాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహంతో మాట్లాడే మాట పలికితీరుతుంది. కోరిన కోర్కెలు త్వరగా నెరవేరుతాయి. చెడు దృష్టి, నరగోడడు, చేతబడి వంటి నకారాత్మక శక్తుల నుండి ఈమె భక్తులకు కవచంలా రక్షణ ఇస్తుంది.