శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

నైరుతి (దక్షిణ - పడమర మూల): నిరృతి

Back

నైరుతి (దక్షిణ - పడమర మూల): నిరృతి

Pineapple

హిందూ పురాణాల ప్రకారం నిరృతి నైరుతి దిక్కుకు అధిపతి. అష్టదిక్పాలకులలో ఈయన ఒకరు. ఈయనను రాక్షస రాజుగా, పాపాలు మరియు కష్టాలకు అధిదేవతగా వర్ణిస్తారు. రృతి అధర్మానికి మరియు హింసకు పుట్టిన కుమారుడిగా పురాణాలు చెబుతున్నాయి.స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం - శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి.

శ్లోకం :-

"రక్షోగణాధిపం ఘోరం ఖడ్గహస్తం మహాబలమ్ |

నరవాహన సంయుక్తం నిరృతిం ప్రణమామ్యహమ్ ||"

భావం :-

రాక్షస గణాలకు అధిపతి, భయంకరమైన రూపం కలవాడు, చేతిలో ఖడ్గాన్ని ధరించినవాడు, మహా బలశాలి మరియు నరుడిని వాహనంగా చేసుకున్నవాడైన ఆ నిరృతి దేవునికి నేను ప్రణామం చేస్తున్నాను.