శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

ఆగ్నేయం (తూర్పు - దక్షిణ మూల): అగ్ని దేవుడు

Back

ఆగ్నేయం (తూర్పు - దక్షిణ మూల): అగ్ని దేవుడు

Pineapple

హిందూ పురాణాల ప్రకారం అగ్ని దేవుడు పంచభూతాలలో ఒకరైన అగ్నికి అధిపతి. వేదాలలో ఇంద్రుని తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన దేవుడు అగ్ని దేవుడే. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుని మానస పుత్రుడైన మరీచి కుమారుడు కశ్యప ప్రజాపతి, దక్షుని కుమార్తె అయిన అదితి దంపతులకు అగ్ని దేవుడు జన్మించాడు.స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం - శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి.

శ్లోకం :-

"వైశ్వానర నమస్తుభ్యం జగదాధార హేతవే |

ఆహుతిం పరిగృహ్యేమాం సౌఖ్యం దేహి నమస్తుతే ||"

భావం :-

జగత్తు మొత్తానికి ఆధారమైన, వైశ్వానరుడు (అగ్ని) అనే పేరు గల ఓ అగ్ని దేవా! నీకు నమస్కారం. నేను సమర్పిస్తున్న ఈ ఆహుతిని స్వీకరించి, మాకు సుఖసంతోషాలను ప్రసాదించు.