శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

దక్షిణం: యముడు (ధర్మరాజు)

Back

దక్షిణం: యముడు (ధర్మరాజు)

Pineapple

హిందూ పురాణాల ప్రకారం యమధర్మరాజు (యముడు) మరణానికి, న్యాయానికి మరియు ధర్మానికి అధిపతి. దక్షిణ దిక్కుకు లోకపాలకుడు (దిక్పాలకుడు). జీవుల పాపపుణ్యాలను లెక్కగట్టి, వారి కర్మలను బట్టి శిక్షలు వేసే నిష్పక్షపాతమైన దేవుడు. యముడు సూర్యభగవానుడు మరియు ఆయన భార్య సంజ్ఞాదేవిల కుమారుడు.స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం - శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి.

శ్లోకం :-

"ఓం సూర్యపుత్రాయ విద్మహే మహాకాలాయ ధీమహి |

తన్నో యమః ప్రచోదయాత్ ||"

భావం :-

సూర్యపుత్రుడు, కాల స్వరూపుడైన ఆ యమధర్మరాజును మేము తెలుసుకుంటున్నాము. ఆ మహాకాలునిపై మేము ధ్యానం చేస్తున్నాము. ఆ యమదేవుడు మా బుద్ధిని సన్మార్గంలో నడిపించుగాక!