శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
వాయువ్యం (పడమర - ఉత్తర మూల): వాయు దేవుడు
వాయువ్యం (పడమర - ఉత్తర మూల): వాయు దేవుడు
హిందూ పురాణాల ప్రకారం వాయు దేవుడు వాయువ్య దిక్కుకు అధిపతి. అష్టదిక్పాలకులలో ఒకరైన ఈయన విశ్వంలోని ప్రాణవాయువుకు, గాలికి మరియు చలనానికి అధిదేవత. జీవులందరిలో 'ప్రాణ రూపంలో' ఉండేది ఈయనే కాబట్టి, ఈయన్ని ప్రాణదేవుడు అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం వాయు దేవుడు కశ్యప ప్రజాపతి మరియు అదితి దంపతుల కుమారుడు.స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం - శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి.
శ్లోకం :-
"ప్రాణరూపం జగద్వ్యాప్యం ధ్వజహస్తం మహాబలమ్ |
మృగవాహన సంయుక్తం వాయుదేవం ప్రణమామ్యహమ్ ||"
భావం :-
సమస్త జీవులలో ప్రాణ రూపంలో ఉన్నవాడు, జగమంతా వ్యాపించి ఉన్నవాడు, చేతిలో ధ్వజాన్ని (జెండాను) ధరించినవాడు, మహా బలశాలి మరియు జింకను వాహనంగా చేసుకున్నవాడైన ఆ వాయు దేవునికి నేను ప్రణామం చేస్తున్నాను.