శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

ఈశాన్యం (ఉత్తరం - తూర్పు మూల): ఈశానుడు (పరమేశ్వరుడు)

Back

ఈశాన్యం (ఉత్తరం - తూర్పు మూల): ఈశానుడు (పరమేశ్వరుడు)

Pineapple

హిందూ పురాణాల ప్రకారం ఈశానుడు ఈశాన్య దిక్కుకు అధిపతి. అష్టదిక్పాలకులలో చివరివాడైన ఈయన సాక్షాత్తు ఆ పరమశివుని ఐదు ముఖాలలో (పంచముఖాలు) ఒక రూపం. ఈశాన్య మూలను దేవమూల లేదా శివమూల అని కూడా పిలుస్తారు. శివుని ఐదు రూపాలైన సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానములలో ఇది ఐదవది. విశ్వంలోని జ్ఞానానికి, విద్యలకు మరియు మోక్షానికి ఈయనే అధిపతి.స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం - శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి.

శ్లోకం :-

"త్రిశూలహస్తం త్రినేత్రం శ్వేతవర్ణ సమన్వితం |

వృషభస్థం జగన్నాథం ఈశానం ప్రణమామ్యహమ్ ||"

భావం :-

చేతిలో త్రిశూలాన్ని ధరించినవాడు, మూడు కన్నులు గలవాడు, తెల్లని రంగుతో ప్రకాశించేవాడు, నందిని వాహనంగా చేసుకున్నవాడు మరియు జగత్తుకే నాథుడైన ఆ ఈశాన దేవునికి (శివునికి) నేను ప్రణామం చేస్తున్నాను.