శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
ఉత్తరం: కుబేరుడు (సంపదలకు అధిపతి)
ఉత్తరం: కుబేరుడు (సంపదలకు అధిపతి)
హిందూ పురాణాల ప్రకారం కుబేరుడు ఉత్తర దిక్కుకు అధిపతి. అష్టదిక్పాలకులలో ఒకరైన ఈయన విశ్వంలోని సంపదలకు, నవనిధులకు మరియు స్వర్ణ లోకాలకు అధిదేవత. ఈయనను యక్షులకు రాజుగా (యక్షరాజ) మరియు ధనపతిగా పూజిస్తారు. కుబేరుడు బ్రహ్మదేవుని మానస పుత్రుడైన పులస్త్య మహర్షి మనుమడు మరియు విశ్రవసు మహర్షి, ఇడవిడ దంపతుల కుమారుడు.స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం - శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి.
శ్లోకం :-
"ధనధాన్య సమృద్ధిం మే దేహి దాపయ స్వాహా |
నరవాహన రూపాయ కుబేరాయ నమో నమః ||"
భావం :-
మనుష్యుడిని వాహనంగా చేసుకున్న రూపం కలవాడా, సమస్త సంపదలకు అధిపతి అయిన ఓ కుబేర దేవా! నాకు ధనధాన్య సమృద్ధిని ప్రసాదించు. నీకు నా భక్తిపూర్వక నమస్కారాలు.