శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
శ్రీ కౌమారి దేవి
శ్రీ కౌమారి దేవి
శ్రీ సప్తమాతృకలలో మూడవ వారైన శ్రీ కౌమారి దేవి ఆవిర్భావం దుర్గ సప్తశతి ప్రకారం, రాక్షస సంహారంలో దుర్గాదేవికి తోడుగా నిలిచేందుకు దేవతల శక్తులన్నీ ఒక్కొక్కటిగా తరలివచ్చాయి. ఆ క్రమంలోనే శరవణభవుడు, దేవసేనాపతి అయిన కుమారస్వామి (కార్తికేయుడు/మురుగన్) చైతన్యం, తేజస్సు నుండి కౌమారి దేవి ఆవిర్భవించింది. కుమారస్వామి శక్తి స్వరూపం కాబట్టి ఈమెను "కౌమారి", "కుమారి" లేదా "కార్తికేయి" అని పిలుస్తారు. స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి..
శ్లోకం :-
మయూరకుక్కుటవృతే మహాశక్తిధరేనఘే |
కౌమారీరూపసంస్థానే నారాయణి నమోస్తుతే ||
భావం :-
నెమలి మరియు కుక్కుటము (కోడి) ఆభరణాలుగా/చిహ్నాలుగా కలిగి, చేతిలో అమిత శక్తివంతమైన 'శక్తి ఆయుధాన్ని' ధరించిన పాపరహితురాలైన ఓ కౌమారీ దేవి (నారాయణి స్వరూపిణి)! నీకు వందనములు. కుమారస్వామి రూపంలో నెమలి వాహనాన్ని అధిరోహించి, భక్తులకు వరాలను ప్రసాదించేందుకు విచ్చేసిన ఓ కౌమారీ మాతా, నిన్ను నా హృదయంలోకి ఆవాహన చేసుకుంటున్నాను.
పూజా ఫలితం :-
కౌమారి దేవిని ఆరాధించడం వల్ల ధైర్యం, ఆత్మవిశ్వాసం, శత్రు జయం & వివాదాల నివారణ, కుజ దోష నివారణ, సంతాన సౌఖ్యం వంటి ఫలితాలు లభిస్తాయి.