శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం
తూర్పు దిక్కు: ఇంద్రుడు (దేవతల రాజు)
తూర్పు దిక్కు: ఇంద్రుడు (దేవతల రాజు)
హిందూ పురాణాల ప్రకారం, ఇంద్రుడు దేవతలకు రాజు మరియు స్వర్గలోకానికి అధిపతి. ఆయన తూర్పు దిక్కుకు పాలకుడు మరియు అష్టదిక్పాలకులలో ఒకరు. వాతావరణాన్ని, వర్షాలను నియంత్రించే దేవుడిగా వేదాలలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నారు. మహర్షి కశ్యపుడు, అదితి దంపతుల సంతానంగా ఇంద్రుడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. దేవతలు, అసురులు పాలసముద్రాన్ని మధించినప్పుడు (క్షీరసాగర మథనం) ఇంద్రుని వాహనమైన దివ్య గజం ఐరావతం ఉద్భవించింది.స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం - శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి.
శ్లోకం :-
"ఓం తత్పురుషాయ విద్మహే సహస్రాక్షాయ ధీమహి |
తన్నో ఇంద్రః ప్రచోదయాత్ ||"
భావం :-
పరమ పురుషుడు, వేయి కన్నులు గలవాడైన ఆ ఇంద్రదేవుని గురించి మేము తెలుసుకుంటున్నాము. ఆ దేవేంద్రునిపైనే మేము ధ్యానం చేస్తున్నాము. ఆ ఇంద్రుడు మా బుద్ధిని, ఆలోచనలను మంచి మార్గంలో నడిపించి, మాకు విజయాన్ని ప్రసాదించుగాక!