శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం

శ్రీ చాముండీ దేవి

Back

సోమనాథ జ్యోతిర్లింగం

శ్రీ చాముండీ దేవి

శ్రీ సప్తమాతృకలలో ఏడవ వారైన, చివరి వారైన శ్రీ చాముండీ దేవి (చాముండా అని కూడా పిలుస్తారు) ఆవిర్భావం దుర్గ సప్తశతి (దేవీ మహాత్మ్యం) ప్రకారం, శుంభ-నిశుంభులనే రాక్షసుల సైన్యాధిపతులైన చండ-ముండులు అనే భయంకర అసురులు జగన్మాతపైకి యుద్ధానికి వచ్చారు. అప్పుడు లలితా పరమేశ్వరి దేవి బొమముడి (నుదురు) నుండి అత్యంత రౌద్ర రూపంతో కాళికా దేవి ఆవిర్భవించింది. ఆ దేవి యుద్ధరంగంలో చండ-ముండులను సంహరించి, వారి శిరస్సులను జగన్మాతకు కానుకగా సమర్పించింది. దానికి సంతోషించిన దేవి, "నువ్వు చండ ముండులను సంహరించావు కాబట్టి, ఈ లోకంలో ఇకపై 'చాముండా' (చాముండీ) అనే పేరుతో ప్రసిద్ధి చెందుతావు" అని వరమిచ్చింది. స్వయంభూగా వెలసిన ఆలయ నమూనాలు మరియు మూలవిరార్ నమూనాలను అనుసరిస్తూ "ఓం శివశక్తి పీఠం శంబాల నగరం" నందు శాస్త్రోక్తంగా మంత్ర యంత్ర తంత్రాలను అనుసరించి లోకకల్యాణం కొరకు ప్రతిష్టించబడింది. కావున భక్తులు అందరూ దర్శించండి తరించండి..

శ్లోకం :-

దంష్ట్రాకరాలవదనే శిరోమాలావిభూషణే |

చాముండే ముండమథనే నారాయణి నమోస్తుతే ||

భావం :-

భయంకరమైన కోరలు కలిగిన ముఖముతో, రాక్షసుల తలల దండను ఆభరణంగా ధరించి, చండ-ముండులను హతమార్చిన ఓ చాముండీ దేవి (నారాయణి స్వరూపిణి)! నీకు వందనములు. నల్లని కలువ పూల వంటి దేహచ్ఛాయతో, చేతిలో ఖడ్గము, డాలు ధరించి, ముండమాలను దాల్చిన ఓ చాముండీ మాతా, నిన్ను నా హృదయంలోకి ఆవాహన చేసుకుంటున్నాను.

పూజా ఫలితం :-

ఎంతటి భయంకరమైన భయాలైనా (మృత్యు భయం, చీకటి భయం, శత్రు భయం) అమ్మవారి నామస్మరణతో పటాపంచలు అవుతాయి. మనసుకు అపారమైన ధైర్యం కలుగుతుంది. చేతబడి, పిల్లికూతలు, నరగోడడు, దిష్టి దోషాలు మరియు దుష్ట గ్రహాల పీడలు దేవి అనుగ్రహంతో పూర్తిగా తొలగిపోతాయి. నిలిచిపోయిన పనులు, తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్న వ్యవహారాలు చాముండీ పూజ వల్ల శీఘ్రంగా నెరవేరుతాయి. మనసులో ఉండే చెడు ఆలోచనలు, భ్రమలు తొలగిపోయి నిర్మలమైన బుద్ధి సిద్ధిస్తుంది.